అదనపు కట్నం(Dowry) కోసం కట్టుకున్న భార్యను వేధించడం చూశాం. హింసించడమూ చూశాం. కానీ ఈ వెరైటీ అల్లుడు అత్తమామలపై నాటు తుపాకీతో దాడికి ప్రయత్నించాడు. మంచిర్యాల(mancherial ) జిల్లా కన్నెపల్లి మండలం సాలిగామలో(Saligama) జరిగిన ఈ సంఘటనలో ఆ దంపతులు ప్రాణాలు కాపాడుకోగలిగారు. వివరాల్లోకి వెళితే బెల్లంపల్లి మండలం మాలగురిజాలకు చెందిన గోమాస నరేందర్‌కు(Narendra) సాలిగామకు చెందిన గోలేటి శంకర్‌ కూతురు బేబీకి 2016లో పెళ్లయ్యింది.

అదనపు కట్నం(Dowry) కోసం కట్టుకున్న భార్యను వేధించడం చూశాం. హింసించడమూ చూశాం. కానీ ఈ వెరైటీ అల్లుడు అత్తమామలపై నాటు తుపాకీతో దాడికి ప్రయత్నించాడు. మంచిర్యాల(mancherial ) జిల్లా కన్నెపల్లి మండలం సాలిగామలో(Saligama) జరిగిన ఈ సంఘటనలో ఆ దంపతులు ప్రాణాలు కాపాడుకోగలిగారు. వివరాల్లోకి వెళితే బెల్లంపల్లి మండలం మాలగురిజాలకు చెందిన గోమాస నరేందర్‌కు(Narendra) సాలిగామకు చెందిన గోలేటి శంకర్‌ కూతురు బేబీకి 2016లో పెళ్లయ్యింది. కరీంనగర్‌లో భార్య, ఇద్దరు పిల్లలతో నరేందర్‌ నివాసం ఉంటున్నాడు. పెళ్లయిన దగ్గర్నుంచి నరేందర్‌ అదనపు కట్నం కోసం భార్యను వేధించసాగాడు. అత్తమామల పేరుతో ఉన్న ఆస్తి రాయించుకురావాలంటూ హింసించసాగాడు. ఇదే విషయంపై గతంలో ఓసారి అత్తమామలపై గొడ్డలితో దాడి చేసేందుకు ప్రయత్నించాడట! ఎక్కడ కూతురు కాపురం పాడైపోతుందోనని వారు అప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. తాజాగా మంగళవారం భార్యతో గొడవపడిన నరేందర్‌ అత్తమామలను చంపేందుకు ఫ్రెండ్‌ మహేశ్‌తో కలిసి సాలిగామకు వచ్చాడు. వెంట తెచ్చుకున్న నాటు తుపాకీతో రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. అప్పటికే అప్రమత్తమైన అత్తమామలు ఊళ్లోకి పరుగెత్తి ప్రాణాలు కాపాడుకున్నారు. ఆ నాటు తుపాకీని(Gun) నరేందర్‌ బీహార్‌(Bihar) నుంచి తెచ్చుకున్నట్టు సమాచారం. ముందు తుపాకీ కొని, ఆ తర్వాత బుల్లెట్లు సమకూర్చుకున్నాడట! తుపాకీ ఎలా కాల్చాలో తెలియక కరీంనగర్‌ పేపర్‌ ప్లేట్ల ఫ్యాక్టరీలో తనతో పాటు పని చేసే బీహార్‌ స్నేహితుల దగ్గర ట్రైనింగ్‌ కూడా తీసుకున్నాడట! నరేందర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు అతడి కోసం వెతుకుతున్నారు.

Updated On 29 Feb 2024 12:37 AM GMT
Ehatv

Ehatv

Next Story