ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల తిరుపతి దేవస్థానం( TTD) పై కొన్ని సంస్థలు, పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో విమర్శలు చేయడాన్ని బాధ్యత గల వ్యక్తులు స్వాగతించాలి. చేస్తున్న విమర్శలు సద్విమర్సలు అయితే స్వాగతించాలి. స్వాగతిస్తామని అధికారంలో ఉన్నవారు అంటుంటారు కానీ అధికార పార్టీ స్వాగతించే సద్విమర్శలు ఆచరణలో సాధ్యం కాదు. అవసరం కూడా లేదు. అదే సమయంలో టిటిడి వ్యవహారంలో కొందరు చేస్తున్న విమర్శలు ఒక ఫ్యాషన్ గా మారింది. ఈ పరిణామం మంచిది కాదు.

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఆధ్యాత్మిక కేంద్రం తిరుమల తిరుపతి దేవస్థానం( TTD) పై కొన్ని సంస్థలు, పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో విమర్శలు చేయడాన్ని బాధ్యత గల వ్యక్తులు స్వాగతించాలి. చేస్తున్న విమర్శలు సద్విమర్సలు అయితే స్వాగతించాలి. స్వాగతిస్తామని అధికారంలో ఉన్నవారు అంటుంటారు కానీ అధికార పార్టీ స్వాగతించే సద్విమర్శలు ఆచరణలో సాధ్యం కాదు. అవసరం కూడా లేదు. అదే సమయంలో టిటిడి వ్యవహారంలో కొందరు చేస్తున్న విమర్శలు ఒక ఫ్యాషన్ గా మారింది. ఈ పరిణామం మంచిది కాదు.

తాజాగా పాలకమండలిని 24 మందితో ప్రభుత్వం నియమించింది. పాలకమండలి సభ్యులు(TTD Board Members) నియామకం ఏపీ ప్రభుత్వం(AP Government) చేస్తుంది. ప్రభుత్వం అంటేనే రాజకీయ పార్టీ నాయకత్వంలో పనిచేస్తుంది. అలాంటప్పుడు టీటీడీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చినారని రాజకీయ పార్టీలు విమర్శలు చేయడం ఫ్యాషన్ కాకపోతే ఏమిటి ? నియమించిన సభ్యులలో వివాదాస్పద వ్యక్తులు ఉంటే వ్యతిరేకించాలి. ప్రస్తుత బోర్డు లో ఇద్దరు ముగ్గురు సభ్యుల నియామకం విషయంలో విమర్శలు వస్తున్నాయి. అలాంటి వారిని నియమించే విషయంలో ప్రభుత్వం జగ్రత్త వహించి ఉండాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ప్రభుత్వంపై విమర్శలు చేయడం కచ్చితంగా స్వాగతించాలి. ప్రభుత్వం కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. విచిత్రంగా వారు రాజకీయ నాయకులు కాదు రాజకీయ పునరావాస కేంద్రం అనడం ఎందుకు ? ఫ్యాషన్ కాకపోతే ! రాజకీయ ప్రభుత్వం జోక్యం చేసుకుని దేవాలయాలు దేశంలో ఎలా పనుచేస్తున్నాయో వాటిని పరిశీలిస్తే అర్థం చేసుకోవచ్చు. వ్యక్తుల చేతుల్లో నడుస్తున్న దేవాలయాలతో పోల్చుకుంటే టిటిడి 100 రేట్లు మెరుగ్గా ఉన్నది.

బీజేపీ కి విమర్శించే హర్హత ఉన్నదా ?

పదే పదే ఇలాంటి విమర్శలు చేస్తున్నది బీజేపీ. టిటిడి ప్రస్తుత బోర్డు రాజకీయ పునరావాస కేంద్రంగా మారింది అంటున్న బీజేపీ అదే బోర్డులో 24 మందికి గాను అరడజను మంది సదరు పార్టీ సిఫార్సుతో వచ్చారని విమర్శలు వస్తున్నాయి. అవునా ? కాదా ?బీజేపీ నిజాయితీగా వాస్తవాలు చెప్పాలి. ఒక వైపు ఏ అధికారం లేకుండా అరడజను మందిని సిఫార్సు చేసిన సదరు పార్టీ నియామక అధికారం కలిగిన పార్టీ పై విమర్శలు చేస్తున్నది. బోర్డులో రాజకీయ నాయకులు కాకుండా ఆధ్యాత్మిక వేత్తలు ఉండాలి అంటున్న బీజేపీ తాము సిఫార్సు చేసిన వారిలో ఎందరు ఆధ్యాత్మిక వేత్తలు ఉండారో చెప్పాలి.

ఒక ప్రజాప్రతినిది ఏకంగా టిటిడి చైర్మన్ తన ఎన్నికల ఆఫీడివిట్ లో తాను క్రిస్టియన్ అని డిక్లరేషన్ ఇచ్చారు అంటారు. వీరి విశ్వాసం ఏమిటంటే ప్రజలు ఆఫీడివిట్ చూడరుగా అన్న ధీమా. అసలు ఎన్నికల ఆఫీడివిట్ లో మత ప్రస్తావన ఉంటుందా ? ప్రజలకు తెలియదు కాబట్టి ఏమైనా చెప్పవచ్చు. టిటిడి లో ఈఓ గా పని చేసిన ఓ అధికారి ఈ విషయం మీద స్పందిస్తూ అన్యమతస్తులు డిక్లరేషన్ పై సంతకం పెట్టాలి అంటారు. శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు ఇతర మతస్థులు అయితే శ్రీవారి పై నమ్మకం ఉంది అని సంతకం చేయాలి కానీ ఛైర్మన్ గా నియమకం అయిన వారికి అవకాశం లేదు. ఎందుకంటే హిందూ కానీ వారు చైర్మన్ కాదు కధ 2007 తర్వాత సాధారణ ఉద్యోగానికి కూడా అర్హులు కాదు. ఆ చట్టం తీసుకువచ్చిన భూమన కరుణాకర్ రెడ్డి తాను ఎన్నికల ఆఫీడివిట్ లో క్రిస్టియన్ అని పేర్కొని టిటిడి చైర్మన్ ఎలా అవుతారు. ఈ మాత్రం కూడా పరిశీలించకుండా చైర్మన్ మీద విమర్శలు చేయడం రాజకీయం అందమా ? ఫ్యాషన్ అనాలా ?

టిటిడి బోర్డు సభ్యుల నియామకంలో గాని రోజు వారీ పాలన ముక్యంగా భక్తుల వసతి సౌకర్యాలు దర్సనాల ఏర్పాటు లాంటి అంశాలలో ఎలాంటి తప్పులు జరిగినా బోర్డు దాన్ని నియమించిన ప్రభుత్వంపై ఖచ్చితంగా విమర్శలు చేయాలి. హేతుబద్ధ విమర్శలుపై అధికార యంత్రాంగం స్పందించి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. ప్రజలకు సమాచారం ఉండదు కాబట్టి ఎదో ఒకటి మాట్లాడితే చెల్లిపోతుంది అనుకుని టిటిడి పై ఫ్యాషన్ గా విమర్శలు చేస్తే ప్రయోజనం శూన్యం. ఇలాంటి విమర్శలు చేస్తే రేపు నిజం చెప్పినా భక్తులు నమ్మరు. సంచలనాల కోసం విమర్శలు చేసే వారు ఉన్న నేపథ్యంలో టిటిడి అధికార యంత్రాంగం జాగురతతో నిత్యం వ్యవహరించాలి. ప్రభుత్వం కూడా తనవైపు నుంచి తీసుకునే విధానపరమైన అంశాలపై విమర్శలుకు తావు లేకుండా నిర్ణయాలు ఉండాలి. తప్పులు దొర్లితే సరిదిద్దుకోవాలి. ఈ సంప్రదాయం ఈ బోర్డు నుంచే జరిగితే అందరికి మంచిది.

మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి
తిరుపతి

Updated On 26 Aug 2023 7:54 AM GMT
Ehatv

Ehatv

Next Story