తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గోవిందరాజస్వామి ఆలయం సమీపంలో ఉన్న లావణ్య ఫోటో ఫ్రేమ్‌ వర్క్స్‌ దుకాణంలో మంటలు చెలరేగాయి. అయిదు అంతస్తుల భవంనలోని ఓ ఫ్లోర్‌లో ఫోటో ఫ్రేమ్ వర్క్స్‌ షాపు ఉంది. అందులో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వ్యాపించిన మంటల కారణంగా కోట్ల రూపాయల విలువైన ఫోటోలు ఆహుతయ్యాయి.

తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం (Tirupati Fire Accident) సంభవించింది. గోవిందరాజస్వామి ఆలయం సమీపంలో ఉన్న లావణ్య ఫోటో ఫ్రేమ్‌ వర్క్స్‌ దుకాణంలో మంటలు చెలరేగాయి. అయిదు అంతస్తుల భవంనలోని ఓ ఫ్లోర్‌లో ఫోటో ఫ్రేమ్ వర్క్స్‌ షాపు ఉంది. అందులో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వ్యాపించిన మంటల కారణంగా కోట్ల రూపాయల విలువైన ఫోటోలు ఆహుతయ్యాయి. పది అగ్నిమాపక వాహనాల్లో సిబ్బంది ఘటన స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. పది ద్విచక్ర వాహనాలు, ఆరు దుకాణాలు దగ్దమయ్యాయని టీటీడీ (TTD) ఈవో ధర్మారెడ్డి చెప్పారు. ఇదిలా ఉంటే తిరుపతి గోవిందరాజస్వామి రథం అగ్నికి ఆహుతి అయినట్టుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని తిరమల తిరుపతి దేవస్థానం తెలిపింది. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం సమీపంలో ఉన్న లావణ్య ఫోటో ఫ్రేమ్స్ దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆ దుకాణం మాత్రమే అగ్నికి ఆహుతి అయింది తప్ప గోవిందరాజు స్వామి ఆలయ రథానికి ఎటువంటి ప్రమాదం జరగలేదని టీటీడీ పేర్కొంది.

Updated On 16 Jun 2023 4:15 AM GMT
Ehatv

Ehatv

Next Story