Salakatla Brahmotsavams : అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు... పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలలో(Tirumala) శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు(Salakatla Brahmotsavams) అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆరో రోజు శనివారం ఉదయం హనుమంత వాహనంపై(vehicle of Hanuman) శ్రీ మలయప్ప స్వామి(Sri Malayappa Swamy) భక్తులకు అభయం ఇచ్చారు. శనివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి స్వర్ణరథంపై శ్రీవారు భక్తులకు అభయప్రదానం చేస్తారు. మహిళా భక్తులే స్వర్ణ రథం లాగడం దీని ప్రత్యేకత.

అలాగే రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు గజ వాహన సేవలు జరుగుతాయి. ఇదిలా ఉంటే తిరుమలలో భక్తుల రద్దీ అమాంతం పెరిగింది. శ్రీవారి దర్శనానికి 30 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి చూస్తున్నారు. సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న గరుడోత్సవం రోజు శ్రీవారిని 72, 650 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,410 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.
కాగా గరుడోత్సవం రోజున శ్రీవారికి 3.33 కోట్ల రూపాయల హుండీ ఆదాయం చేకూరింది. మరోవైపు శ్రీవారి గరుడ సేవను చూడటానికి తిరుమల నాలుగుమాడ వీధుల్లో వేచి ఉన్న భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలను టీటీడీ అధికారులు(TTD Official) పరిశీలించారు. శుక్రవారం రాత్రి శ్రీవారు గరుడ వాహనాన్ని అధిరోహించారు. రాత్రి ఏడు గంటలకు మొదలైన ఈ వాహన సేవ అర్ధరాత్రి వరకు సాగింది. స్వామివారు ఎక్కడికి వెళ్లినా గరుడ వాహనంపైనే వెళతారు..ఖగరాజు ఆయన ప్రధాన వాహనం.
అందుకే ఆ పక్షీంద్రుడిని పెరియ తిరువాడి అంటారు.. అంటే ప్రధాన భక్తుడన్నమాట.గరుడ వాహనం ముందు భక్త బృందాలు, భజనలు, డప్పు వాయిద్యాలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వాయు గమనంతో పోటీపడే గరుత్మంతుడిని వాహనంగా చేసుకుని విశ్వాన్ని పాలించే జగత్కల్యాణ చక్రవర్తి మలయప్ప దేదీప్యమాన కాంతులతో ఆలయ మాడ వీధుల్లో ఊరేగారు.
విశిష్టమైన గరుడ వాహన సేవలో గర్భాలయ మూలమూర్తికి వాడుతున్న మకరకంఠి, లక్ష్మిహారం, సహస్ర నామ కాసులమాల, సుదర్శన చక్రమాల, మూలవిరాట్‌కు అలంకరించే పురాతనమైన విశేష ఆభరణాలు, శ్రీవిల్లి పుత్తూరు ఆండాళ్ తులసి, పుష్పమాల, చెన్నై నూతన ఛత్రాలను(గొడుగులు) అలంకరించారు. తన నిత్య సేవకుడు గరుత్మంతుడిపై దేవదేవుడు వైభవంగా ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.