Nara Lokesh : 27 నుంచి లోకేష్ ‘యువగళం’ పాదయాత్ర పున:ప్రారంభం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర ఈ నెల 27న పున:ప్రారంభం కానుంది. స్కిల్ కేసులో టీడీపీ అధినేత, లోకేష్ తండ్రి చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో

Lokesh’s ‘Yuvagalam’ padayatra will resume from 27th
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) ‘యువగళం(Yuvagalam)’ పాదయాత్ర ఈ నెల 27న పున:ప్రారంభం కానుంది. స్కిల్ కేసులో టీడీపీ(TDP) అధినేత, లోకేష్ తండ్రి చంద్రబాబు(Chandrababu) అరెస్ట్(Arrest) నేపథ్యంలో పాదయాత్ర తాత్కాలికంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్(Regular Bail) లభించడంతో పాదయాత్రను తిరిగి కొనసాగించాలని లోకేశ్ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే 27న పున:ప్రారంభం కానుంది.
చంద్రబాబు అరెస్టు కారణంగా సెప్టెంబరు 9న పాదయాత్రకు బ్రేక్ ప్రడింది. కోనసీమ(Konaseema) జిల్లా రాజోలు(Rajolu) నియోజకవర్గంలోని పొదలాడ(Podalada) నుంచి పాదయాత్ర తిరిగి ప్రారంభం కానుంది. అయితే ముందుగా నిర్దేశించుకున్నట్టుగా పాదయాత్ర ఇచ్చాపురం వరకు జరగదు. డిసెంబర్ చివరిలో విశాఖపట్నం(Visakhapatnam)లోనే ముగియనుంది. దాదాపు రెండున్నర నెలలపాటు విరామం రావడం.. మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో విశాఖపట్నంలో ముగించాలని లోకేశ్ నిర్ణయించుకున్నారు.
27న పున:ప్రారంభమై రాజోలు, అమలాపురం(Amalapuram), ముమ్మిడివరం(Mummadivaram), కాకినాడ పట్టణ(Kakinad Urban), కాకినాడ గ్రామీణ(Kakinada Rural), పిఠాపురం(Pitapuram), తుని నియోజకవర్గాల మీదుగా అనకాపల్లి(Anakapalli) జిల్లాలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి విశాఖపట్నం చేరుకున్నాక అక్కడ పాదయాత్రను ముగించనున్నారు. ఇందుకు తగ్గట్టు రూట్ మ్యాప్‌ను పార్టీ వర్గాలు రూపొందిస్తున్నాయి.
ఇదిలావుంటే.. 400 రోజుల్లో 4 వేల కిలోమీటర్లు పాదయాత్రకు టీడీపీ రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేసింది. జనవరి 27న కుప్పంలో మొదలుపెట్టగా.. పాదయాత్రకు విరామం ప్రకటించే సమయానికి 208 రోజుల్లో 2,852.4 కిలోమీటర్లు పూర్తయ్యింది. 84 నియోజకవర్గాలలో ఈ యాత్ర కొనసాగింది.
