Skill Development Scam : నేడు చంద్రబాబుతో లోకేశ్, పవన్, బాలకృష్ణ ములాఖత్
స్కిల్ డెవలప్‌మమెంట్ కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబును గురువారం నారా లోకేశ్, పవన్ కల్యాణ్, బాలకృష్ణ కలవనున్నారు.

Lokesh, Pawan, Balakrishna Mulakhat with Chandrababu today
స్కిల్ డెవలప్‌మమెంట్ కేసు(Skill Development Scam)లో అరెస్ట్ అయ్యి రాజమండ్రి(Rajahmundry) జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు(Chandrababu)ను గురువారం నారా లోకేశ్(Nara Lokesh), పవన్ కల్యాణ్(Pawan Kalyan), బాలకృష్ణ(Balakrishna) కలవనున్నారు. చంద్రబాబును కలిసేందుకు వీరు ములాఖత్ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యాహ్నం 12 గంటలకు నారా లోకేశ్, పవన్ కల్యాణ్, బాలకృష్ణ రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే అధికారులు రాజమండ్రి సెంట్రల్ జైలు(Rajahmundry Central Jail) దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం 10 గంటలకు పవన్, బాలకృష్ణ రాజమండ్రికి చేరుకోనున్నారు.
ఇదిలావుంటే.. స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు పూర్తి సంబంధం ఉంది కాబట్టే అరెస్టు చేశామని సీఐడీ అడిషనల్ డీజీ ఎన్ సంజయ్(CID Aditional DG Sanjay) స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు(Arrest), రిమాండ్(Remand) అనంతరం చాలా ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయని పేర్కొన్నారు. కేబినెట్ అనుమతి లేకుండానే స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఏర్పాటు చేశారని.. ఈ కార్పోరేషన్ ఏర్పాటులో విధి విధానాలు పాటించలేదని వివరించారు.
