సనాతన ధర్మం ఎటుపోయింది పవన్..!

జైభీంరావు పార్టీ(Jai bheen rao Party) అధినేత జడ శ్రవణ్(Jada sravan) ప్రెస్‌మీట్‌లో(Pressmeet) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వం ఏర్పడితే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలించడంలేదని శ్రవణ్ ఆరోపించారు. తిరుమల(Tirumala) అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆలయమని.. అలాంటి టీటీడీలో(TTD) టీడీపీ(TDP), బీజేపీ(BJP) నేతలకు అవకాశం కల్పిస్తారా. గత ప్రభుత్వంలో రాజకీయనాయకులుంటే విమర్శలు చేశారు కదా.. మరి ఈ ప్రభుత్వం ప్రకటించిన టీటీడీ పాలకమండలిలో ఎంత మంది సనాతన ధర్మాన్ని, టీటీడీ పవిత్రతను కాపాడేవారున్నారని ఆయన ప్రశ్నించారు. నేర చరిత్ర కలిగినవారు, ట్యాక్స్‌ ఎగ్గొట్టినవారిని ఎలా నియమిస్తారని అడిగారు. సనాతన ధర్మం, టీటీడీ పవిత్రత అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడే పవన్‌ కల్యాణ్‌ ఎందుకు స్పందించడం లేదని.. లడ్డూ విషయంలో గాయిగాయి చేసిన పవన్ కల్యాణ్‌.. లడ్డూ కల్తీ జరిగిందో లేదో సిట్‌ ఎందుకు తేల్చడంలేదన్నారు. నేర చరిత్ర కలిగిన నేతలను టీటీడీ పాలకమండలి సభ్యులుగా ఎలా నియమిస్తారో పవన్‌ కల్యాణ్‌ స్పందించాలని జడ శ్రవణ్ డిమాండ్ చేశారు.


Updated On 1 Nov 2024 6:39 AM GMT
Eha Tv

Eha Tv

Next Story