✕
Liquor Shops : మూడు రోజులు మద్యం దుకాణాలు బంద్
By YagnikPublished on 28 May 2024 10:55 PM GMT
ఏపీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో జూన్ 3, 4, 5 తేదీల్లో మద్యం అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్లు ఏపీ డీజీపీ హరీశ్ గుప్తా పేర్కొన్నారు.

x
Liquor shops will be closed for three days
ఏపీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో జూన్ 3, 4, 5 తేదీల్లో మద్యం అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్లు ఏపీ డీజీపీ హరీశ్ గుప్తా పేర్కొన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని డీజీపీ హరీశ్ గుప్తా వెల్లడించారు. జూన్ 3, 4, 5 తేదీల్లో మద్యం అమ్మకాలను నిషేధించాలని అన్ని జిల్లాల అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని హోటల్స్, లాడ్జీలలో తనిఖీలు చేసి అనుమానితులను అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలనూ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Yagnik
Next Story