Rain Alert : తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు
తెలుగు రాష్ట్రాలను ఇప్పుడు సరికొత్త రుతువు పలకరిస్తోంది. మండు వేసవిలో అదీ కూడా బండలు పగిలేంత ఎండల్లో వర్షాలు రావడమే విచిత్రం. 7వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం చోటు చేసుకోనుందట. 8వ తేదీన ఆది వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇది బంగాళాఖాతంవైపు కదులుతూ తుఫాన్‌గా మారే అవకాశం ఉందని చెబుతోంది. అయితే ద్రోణి ప్రభావంతో తెలుగు రా:ఆలలో మళ్లీ వానలు పడే అవకాశం ఉంది. ద్రోణి కారణంగా తెలంగాణలో నేడు, రేపు మోస్తరు వర్షాల నుంచి భారీ వర్షాలు పడనున్నాయి.

ఇవాళ నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపే, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, కామారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయి. రేపు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయి. ఎల్లుండి అంటే 7వ తేదీన సూర్యాపేట, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, ఖమ్మం, నల్లగొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వానలు పడతాయి. ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.