ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం 6 గంటలకు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి ప్రచారం మొదలైంది. ఇక నేటితో రాజకీయ పార్టీలు సైలెంట్ అవ్వనున్నాయి. మే 13న జరిగే పోలింగ్‌కు 48 గంటల ముందు ఎటువంటి ప్రచారం చేయకూడదు. ఈ సమయంలో ఎటువంటి సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ప్రచురించడం, ప్రసారం చేయకూడదు. వచ్చే 72 గంటల్లో అధికారులు చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్‌మీనా ఆదేశాలు జారీ చేశారు. హింసకు, రీ పోలింగ్‌కు తావు లేకుండా ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్లు, ఎస్పీలను మీనా ఆదేశించారు.
1వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు నుండి నిశ్శబ్ద కాలం అమల్లోకి వస్తుంది. ఆ సమయంలో ఎన్నికల ప్రచారానికి పూర్తిగా తెరపడుతుంది. చట్టవిరుద్ధమైన సమావేశాలపై నిషేధం ఉంటుంది. పోలింగ్ ముగింపు సమయం ఆధారంగా మద్యం దుకాణాలకు 48 గంటల డ్రై డే అని చెప్పవచ్చు. ప్రచారం నిమిత్తం ఇతర ప్రాంతాల నుండి వచ్చిన నాయకులు, వ్యక్తులు ప్రచార సమయం ముగిసిన వెంటనే నియోజకవర్గం నుంచి వెళ్లిపోవాలి.