పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఎదో సాధించాలని తపనతో వచ్చిన వ్యక్తి.. రాజకీయాల్లో దోచుకొని దాచుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు.. ఒక్క రోజు షూటింగ్ చేస్తే 2 కోట్లు సంపాదిస్తాను అని స్వయానా ఆయనే పలు సందర్భాలలో చెప్పుకున్నారు. ప్యాకేజి స్టార్, దత్తపుత్రుడు ఇలా అధికారపక్షం ఆయనపై చేసే విమర్శలు అన్నీ ఇన్ని కావు.. నిజానికి పవన్ కళ్యాణ్‏కి ప్యాకేజి తీసుకోవాల్సిన అవసరం లేదు.. ఇటీవల జనసేన పార్టీకి జనసైనికుల నుంచి వచ్చిన ఫండ్ దాదాపు 50కోట్లు.. అంటే జనసేన పార్టీకి ఫాలోయింగ్ ఏ రేంజ్‏లో ఉంది అనేదానికి ఇది ఒక నిదర్శనం

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రాజకీయాల్లో ఎదో సాధించాలని తపనతో వచ్చిన వ్యక్తి.. రాజకీయాల్లో దోచుకొని దాచుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు.. ఒక్క రోజు షూటింగ్ చేస్తే 2 కోట్లు సంపాదిస్తాను అని స్వయానా ఆయనే పలు సందర్భాలలో చెప్పుకున్నారు. ప్యాకేజి స్టార్, దత్తపుత్రుడు ఇలా అధికారపక్షం ఆయనపై చేసే విమర్శలు అన్నీ ఇన్ని కావు.. నిజానికి పవన్ కళ్యాణ్‏కి ప్యాకేజి తీసుకోవాల్సిన అవసరం లేదు.. ఇటీవల జనసేన (Janasena) పార్టీకి జనసైనికుల నుంచి వచ్చిన ఫండ్ దాదాపు 50కోట్లు.. అంటే జనసేన పార్టీకి ఫాలోయింగ్ ఏ రేంజ్‏లో ఉంది అనేదానికి ఇది ఒక నిదర్శనం

రైతు భరోసా యాత్ర (Rythu Bharosa Yatra), జనసైనికులకు సాయం, ప్రజాసమస్యలపై పోరాటం, ప్రజలకు అండగా నిలబడటం ఇలా నిత్యం ప్రజలతో ఉంటూ పార్టీని ఎంతో కొంత బలోపేతం చేస్తూ వస్తున్నారు... పవన్ ఇంత చేస్తున్నా ప్రజలకు మాత్రం ఆయనపై నమ్మకం రావడంలేదు. దాని కారణం ఏంటి అంటే గత ఎన్నికల్లో అయన ప్రవర్తన అనే చెప్పాలి.. గత రెండు ఎన్నికల్లో పవన్ పొత్తులతోనే ఎన్నికలకు వెళ్లారు.. దానిని సాకుగా తీసుకున్న వైసీపీ(YCP) పవన్‏కు రాజకీయం చేతకాదని.. అందుకే ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకొని వారిని ముఖ్యమంత్రిని చేయడానికే పవన్ పని చేస్తారని విమర్శలు చేస్తున్నారు.. గత రెండు ఎన్నికల అనుభవాలను పవన్ పట్టించుకోవడం లేదా..? మళ్లీ పొత్తుల పేరుతో అదే తప్పు చేస్తున్నారా అంటే అవును అనే చెప్పాలి.. రాబోయే ఎన్నికల్లో కూడా అయన టీడీపీతో (TDP) పొత్తు పెట్టుకొని పోటీ చేస్తామని క్లియర్‏గా చెప్పారు. పవన్‏ను సీఎంను చేయాలనీ చూస్తున్న జనసైనికులకు తాను సీఎం కాలేనని.. దానికి తగిన అర్హత కూడా మనకు లేదని తేల్చి చెప్పారు.

ఎవరెన్ని అన్నా.. ఏమి చెప్పిన టీడీపీతోనే ఉంటా.. రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తా అని అంటున్నారు పవన్‌. మరి వీరి పొత్తుకు ప్రజలు మద్దతు ఇస్తారా..? ఓట్లు వేసి అధికారంలో కూర్చో బెడతారా అనేది ప్రస్నార్ధకమే.. ఒక విధంగా చెప్పాలంటే జనసేనకు ఇది చివరి అవకాశమనే చెప్పాలి గత ఎన్నికల్లో ఘోర పరాభవం తరువాత మళ్లీ లేచి పార్టీని బలోపేతం చేసుకుంటూ వచ్చారు పవన్.. ఇలాంటి తరుణంలో మళ్లీ పొత్తులకు వెళ్లి దెబ్బ తింటారా.?. లేదా గెలిచి నిలబడతారా? .. ఈసారి కూడా పవన్ దెబ్బతిన్నారంటే ఇక పార్టీనీ తీసుకెళ్లి బంగాళాఖాతంలో కలిపేయాల్సిందే.!

Updated On 25 May 2023 1:51 AM GMT
Ehatv

Ehatv

Next Story