AP Volunteers Removing Votes : వాలంటీర్లు ఓట్లు తొలిగిస్తున్నారా.. ఏపీలో ఏం జరుగుతోంది..?
ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) ఓట్లను(Votes) తొలగిస్తున్నారంటూ ఆంధ్రజ్యోతి(AndhraJyothy) కథనాన్ని ప్రచురించింది. రాష్ట్రంలోని వాలంటీర్లు ప్రతిపక్ష ఓటర్లను వెంబడించి.. ఓట్ల తొలగింపు చేస్తున్నారని కథనం యొక్క సారాంశం. ఎన్నికల సంఘం(Election Commission) దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని కథనంలో వెల్లడించింది. సాధారణంగా ఓటును తొలగించాలంటే..
ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) ఓట్లను(Votes) తొలగిస్తున్నారంటూ ఆంధ్రజ్యోతి(AndhraJyothy) కథనాన్ని ప్రచురించింది. రాష్ట్రంలోని వాలంటీర్లు ప్రతిపక్ష ఓటర్లను వెంబడించి.. ఓట్ల తొలగింపు చేస్తున్నారని కథనం యొక్క సారాంశం. ఎన్నికల సంఘం(Election Commission) దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని కథనంలో వెల్లడించింది. సాధారణంగా ఓటును తొలగించాలంటే.. చనిపోయిన వ్యక్తి అయితే కుటుంబ సభ్యులకు నోటీసులివ్వాలి. అడ్రస్ షిఫ్ట్ కారణంగా ఓటు తొలగింపు నోటీసు ఇస్తే.. ఆ నోటీసును ఇరుగుపొరుగు వారికి అందజేయాలి. ఈ రెండు కారణల ద్వారా ఓటు తొలగింపు జరిగితే.. సంబంధిత వ్యక్తికి నోటీసు ఇవ్వాలి.
అయితే.. నోటీసులు(Notice) ఇవ్వకుండా నేరుగా ఓట్లను తొలగిస్తున్నారు. ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి విధుల్లో వాలంటీర్లను(volunteers) పాల్గొనవద్దని కేంద్ర(Central) ఎన్నికల సంఘం కఠిన ఆదేశాలు జారీ చేసినా అది అమలు కావడం లేదు. ఓట్ల తొలగింపు ఎన్నికల కమిషన్‌లోని బీఎల్‌ఓలు(BLO) మాత్రమే చేయాలి. కానీ వాలంటీర్లు వారి స్థానాన్ని ఆక్రమిస్తూ ఈ తొలగింపులు చేస్తున్నట్లు కథనం వెల్లడించింది. ఇటీవల విడుదల చేసిన సవరించిన ఓటర్ల జాబితాలో వివిధ కారణాలతో దాదాపు 10 లక్షల ఓట్లు(10 Lakhs Votes) తొలగించబడ్డాయని ఆంధ్రజ్యోతి నివేదిక పేర్కొంది. ప్రతి నెలా గ్రామ, వార్డు స్థాయిలో ఓటర్ల జాబితాను పరిశీలించాలని, టీడీపీ(TDP) ఓటర్లను తొలగిస్తే ఈసీకి(EC) ఫిర్యాదు చేయాలని టీడీపీ నిర్ణయించింది. కసరత్తును పర్యవేక్షించేందుకు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒక బృందాన్ని నియమించారు.
ఇదిలావుంటే.. ఓటర్ల జాబితాలో పేర్లను తొలగించడం అన్నది కేవలం ఆరోపణగా చేస్తున్నారా.. నిజంగా అలా జరుగుతోందా అన్నది చూడాల్సి ఉంది. వైసీపీ(YCP) నాయకులు అయితే ఈసారి తామే గెలుస్తామని.. ఓటర్ల గల్లంతు అన్నది ప్రతిపక్షాలు చేస్తున్న చెడు ప్రచారం అని అంటున్నారు. వ్యూహాత్మకంగానే టీడీపీ, జనసేన(Janasena) ఈ ప్రచారం మొదలుపెట్టిందని అని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఇటీవల వారాహి యాత్రలో కూడా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) దొంగ ఓట్ల గురించి వ్యాఖ్యలు చేశారు.
అంతేకాకుండా.. ఏపీలో దొంగ ఓట్లు(Stolen votes) భారీగా నమోదవుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్ మీనాకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) నుంచి పిలుపు వచ్చింది. మంగళవారం ఢిల్లీ వెళ్లిన ఆయన.. ఈసీఐ డిప్యూటీ కమిషనర్‌తో మూడు గంటలపాటు సమావేశయ్యారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2024 కార్యక్రమం సన్నద్ధత, ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు వంటి విషయాలపై చర్చించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 21 నుంచి ఆగస్టు 21 వరకు బూత్‌స్థాయి అధికారులను ఇంటింటికి పంపి వివరాలను తనిఖీ చేయిస్తామని పేర్కొన్నారు. అంతకుముందు రోజు రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఓట్ల తొలగింపు, దొంగ ఓట్లపై త్వరలోనే స్పష్టత రానుందని పార్టీలు భావిస్తున్నాయి.