అవినీతి ఆరోపణలతో అరెస్టయిన టీడీపీ(TDP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) నాయుడుకు న్యాయస్థానాలలో ఎదురు దెబ్బలు తగుతున్నాయి. ప్రస్తుతం ఏసీబీ కోర్టు(ACB Court) మొదలుకొని సుప్రీంకోర్టు(Supreme Court) వరకు చంద్రబాబు కేసులు నడుస్తున్నాయి. ఇప్పటి వరకు చంద్రబాబు లాయర్ల కోసం కోట్లాది రూపాయల సొమ్మును వెచ్చించారు. చంద్రబాబు తరఫున వాదిస్తున్న న్యాయవాదులకు(Lawyers) చంద్రబాబు బోల్డంత సొమ్మును చెల్లించారని తెలుగు అకాడమి ఛైర్‌పర్సన్‌ లక్ష్మీ పార్వతి అంటున్నారు.

తన కేసుల కోసం చంద్రబాబు 16 మంది పేరుగాంచిన లాయర్లను నియమించుకున్నారని, మొత్తం 19 మంది ఇందులో పాల్గొంటే ముగ్గురి పేర్లు ఈ న్యాయబృందంలో చేర్చలేదని లక్ష్మీపార్వతి అంటున్నారు. సీనియర్‌ న్యాయవాదులు రోజుకు కోటి రూపాయల నుంచి రెండున్నర కోట్ల రూపాయల వరకు వసూలు చేస్తారని, వీరంతా 40 రోజులుగా చంద్రబాబు కోసం పని చేస్తున్నారని లక్ష్మీపార్వతి లెక్కలు కట్టి చెబుతున్నారు. సీనియర్‌ న్యాయవాదులతో పాటుగా న్యాయవాదులందరికీ చెల్లించిన మొత్తం ఇప్పటికే రెండు వేల కోట రూపాయల వరకు ఉందని ఆమె చెబుతున్నారు.

రోజుకు అన్ని ఖర్చులు కలిపి మూడు కోట్ల రూపాయలు అయ్యిందనుకుంటే 16 మంది న్యాయవాదులకు కలిసి 48 కోట్ల రూపాయలు అవుతోంది. 40 రోజులకు 1, 920 కోట్ల రూపాయలు అవుతుంది. టిఫిన్లు, భోజనాలు ఖర్చులు అదనం. మళ్లీ వారుండేందుకు హోటల్స్‌ ఏర్పాటు చేయాలి. రవాణా ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. వీటిని కూడా లెక్కేస్తే రెండు వేల కోట్ల రూపాయలు దాటుతున్నదని లక్ష్మీపార్వతి స్పష్టం చేస్తున్నారు.

రెండు శాతం హెరిటేజ్‌ షేర్లను అమ్మితే 400 కోట్ల రూపాయలు వస్తుందని ఇంతకు ముందు భువనేశ్వరి(Bhuvaneswari) కామెంట్‌ చేశారు. న్యాయవాదులకు ఫీజులు చెల్లించడానికి, ఇతరత్రా ఖర్చు కోసం భువనేశ్వరి ఎన్ని షేర్లను విక్రయించారో తెలుసుకోవలసిన అవసరం ఉందంటున్నారు. లోకేశ్‌ ఢిల్లీలో మకాం పెట్టింది దాచిపెట్టిన అవినీతి సొమ్మును తెప్పించడానికేమోనన్న అనుమానం ప్రజలకు కలుగుతున్నదని లక్ష్మీ పార్వతి అంటున్నారు.

చంద్రబాబు అత్యంత నీతిపరుడని రోజూ తమ పేపర్లలో, టీవీలలో చూపిస్తున్న ఓ వర్గం మీడియా ఇందుకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. 16 ఏళ్ల పాటు ప్రధానమంత్రి పదవిలో ఉన్న ఇందిరాగాంధీ కూడా తన కేసును వాదించడానికి ఇద్దరే లాయర్లను నియమించుకున్నారని, అమెరికా అధ్యక్షలు కూడా ఈ స్థాయిలో లాయర్లను పెట్టుకునేవారుకాదేమోనని లక్ష్మీ పార్వతి అంటున్నారు.

Updated On 20 Oct 2023 2:36 AM GMT
Ehatv

Ehatv

Next Story