Lagadapati : మళ్లీ రాజకీయాల్లోకి లగడపాటి రాజ్‌గోపాల్..!
ఏపీ(Andhra Pradesh) కాంగ్రెస్‌లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. కర్నాటకలో(Karnataka) కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఆ పార్టీ నేతలు అదే ఊపును తెలంగాణలో కొనసాగించారు. ఆ ఊపులోనే తెలంగాణను(Telangana) హస్తగతం చేసుకున్నారు. దీంతో ఏపీలో కూడా పాత కాంగ్రెస్ నేతలంతా కొత్త పైజామాలు కుట్టుకుంటున్నారని తెలిసింది. వైఎస్ షర్మిల(YS Sharmila) పార్టీలో చేరిన తర్వాత.. మరిన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే సోమవారం మాజీ ఎంపీలు లగడపాటి రాజ్‌గోపాల్(Lagadapati), హర్షకుమార్(Harsh kumar), ఉండవల్లి అరుణ్‌కుమార్(Undavalli) మీటింగ్‌లు పెట్టుకుంటున్నారు.
ఏపీ(Andhra Pradesh) కాంగ్రెస్‌లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. కర్నాటకలో(Karnataka) కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఆ పార్టీ నేతలు అదే ఊపును తెలంగాణలో కొనసాగించారు. ఆ ఊపులోనే తెలంగాణను(Telangana) హస్తగతం చేసుకున్నారు. దీంతో ఏపీలో కూడా పాత కాంగ్రెస్ నేతలంతా కొత్త పైజామాలు కుట్టుకుంటున్నారని తెలిసింది. వైఎస్ షర్మిల(YS Sharmila) పార్టీలో చేరిన తర్వాత.. మరిన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే సోమవారం మాజీ ఎంపీలు లగడపాటి రాజ్‌గోపాల్(Lagadapati), హర్షకుమార్(Harsh kumar), ఉండవల్లి అరుణ్‌కుమార్(Undavalli) మీటింగ్‌లు పెట్టుకుంటున్నారు. ఏపీ విభజనను వ్యతిరేకిస్తూ పార్టీకి దూరంగా ఉంటున్న ఈ మాజీ ఎంపీలు వరుసగా భేటీలు కావడం ఆసక్తిగా మారింది.
దీంతో రాజకీయాల్లో రాజ్‌గోపాల్ రీ ఎంట్రీ ఇస్తారేమోనని వార్తలు ఊపందుకున్నాయి. దీనిపై రాజ్‌గోపాల్ స్పందించారు. తనకు మళ్లీ రాజకీయాల్లోకి(Politics) వచ్చే ఆలోచన లేదని తేల్చి చెప్పారు. రాజకీయాల్లోకి తప్పుకున్నప్పటికీ ఉండవల్లికి, హర్షకుమార్‌కు మద్దతు ఇస్తానని తెలిపారు. వారికి మద్దతుగా ప్రచారం చేస్తానన్నారు. గతంలో జాతీయ పార్టీకి(National Party), ప్రాంతీయ పార్టీకి పోటీ ఉండేదని.. ఇప్పుడు ప్రాంతీయ పార్టీల(Regional party) మధ్య పోటీ పెరిగిందన్నారు. రాజకీయ జన్మనిచ్చింది కాంగ్రెస్(Congress) పార్టీనేనని.. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం తనకు సంతోషం కల్గించిందని చెప్పారు. కాంగ్రెస్ అంటే తనకు గౌరవమేనన్నారు. కాంగ్రెస్ పార్టీ బాగుండాలని కొరుకుంటానన్నారు. అయితే విభజనను వ్యతిరేకిస్తూ రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నానన్నారు.