Kurnool : హోలీ తర్వాత వారం రోజుల పాటు అక్కడ జంబలకిడిపంబే!
కొన్ని ఆచారాలు, సంప్రదాయాలు చిత్రంగా అనిపిస్తాయి. మగవారు ఆడవారిలా మారిపోయి, రతి మన్మథులకు ప్రత్యేక పూజలు చేయడం ఎప్పుడైనా చూశారా? పోనీ ఎక్కడైనా విన్నారా? కర్నూలు(Kurnool) జిల్లాలో ఈ వింత ఆచారం ఉంది. ప్రతి ఏడాది హోలీ పండుగ(Holi festival) మొదలైన రోజు నుంచి వారం రోజుల పాటు ఆ ఊళ్లో ఇలాగే తయారయ్యి పూజలు నిర్వహిస్తారు. ఈ ఆచారం ఎప్పట్నుంచో కొనసాగుతోందని స్థానికులు అంటుంటారు.
కొన్ని ఆచారాలు, సంప్రదాయాలు చిత్రంగా అనిపిస్తాయి. మగవారు ఆడవారిలా మారిపోయి, రతి మన్మథులకు ప్రత్యేక పూజలు చేయడం ఎప్పుడైనా చూశారా? పోనీ ఎక్కడైనా విన్నారా? కర్నూలు(Kurnool) జిల్లాలో ఈ వింత ఆచారం ఉంది. ప్రతి ఏడాది హోలీ పండుగ(Holi festival) మొదలైన రోజు నుంచి వారం రోజుల పాటు ఆ ఊళ్లో ఇలాగే తయారయ్యి పూజలు నిర్వహిస్తారు. ఈ ఆచారం ఎప్పట్నుంచో కొనసాగుతోందని స్థానికులు అంటుంటారు. హోలీ తర్వాత వారం రోజుల పాటు ఆ ఊళ్లో సగం జంబలకిడిపంబే! అంటే మగాళ్లే(Men) మగువల్లా(Women) మారతారు కానీ, మగువలు మగాళ్లుగా మారరు. ఆదోని మండలం సంతేకుళ్లురు గ్రామంలో రతి మన్మథులకు ఓ ఆలయం ఉంది. ఇక్కడ మగవారు ఆడవారిలా తయారవుతారు. చీర కట్టుకుని, జాకెట్టు వేసుకుని, జడలో మల్లెపూలు పెట్టుకుని రతి మన్మథులకు పూజలు చేస్తారు. మొక్కులు మొక్కుంటారు. కోరికలు కోరతారు. ఇలా పూజలు చేయడం వల్ల కుటుంబాలను రతిమన్మథులు చల్లగా చూస్తారని నమ్మకం. వ్యాపారంలో మంచి ఫలితాలు వస్తాయట! ఏడేళ్లుగా తాను క్రమం తప్పకుండా ఇక్కడికి వచ్చి పూజలు చేస్తున్నానని ఓ యువకుడు చెప్పాడు. 'నాన్న ఆరోగ్యం బాగోలేకపోతే డాక్టర్లకు చూపించాము. ఆయన ఆరోగ్యం కొంచెం కూడా మెరుగుపడలేదు. తాత ఆదేశాల మేరకు నాన్న ఇక్కడికి అమ్మాయి వేషంలో వచ్చి పూజలు నిర్వహించారు. ఆశ్చర్యంగా ఆయన పూర్తిగా కోలుకున్నారు. అప్పట్నుంచి నేను కూడా ప్రతి ఏడాది ఒక రోజు ఇలా అమ్మాయిలా మారిపోయి పూజలు చేస్తున్నాను' అని అన్నాడు.