తొలకరి వాన వచ్చింది. పొలం పనులకు రైతులు సిద్ధమయ్యారు. పొలం దున్ని విత్తనాలు వేసే పనిలో పడ్డారు. కర్నూలులో మాత్రం తొలకరి వాన పడిన తర్వాత వజ్రాల కోసం అన్వేషణ మొదలవుతుంటుంది. ప్రతీ ఏడాది జరిగే తంతే ఇది! అదృష్టం బాగుంటే ఒక్క రోజులోనే దశ దిరగవచ్చు. ఆ ఆశతోనే, ఆ నమ్మకంతోనే జనం వజ్రాల వేట సాగిస్తుంటారు. మద్దెకర మండలంలోని తుగ్గలి బసనేపల్లిలో ఇలాగే ఓ రైతు జీవితం మారిపోయింది. రాత్రికి రాత్రే అతడు కోటీశ్వరుడయ్యాడు.

తొలకరి వాన వచ్చింది. పొలం పనులకు రైతులు సిద్ధమయ్యారు. పొలం దున్ని విత్తనాలు వేసే పనిలో పడ్డారు. కర్నూలులో మాత్రం తొలకరి వాన పడిన తర్వాత వజ్రాల కోసం అన్వేషణ మొదలవుతుంటుంది. ప్రతీ ఏడాది జరిగే తంతే ఇది! అదృష్టం బాగుంటే ఒక్క రోజులోనే దశ దిరగవచ్చు. ఆ ఆశతోనే, ఆ నమ్మకంతోనే జనం వజ్రాల వేట సాగిస్తుంటారు. మద్దెకర మండలంలోని తుగ్గలి బసనేపల్లిలో ఇలాగే ఓ రైతు జీవితం మారిపోయింది. రాత్రికి రాత్రే అతడు కోటీశ్వరుడయ్యాడు. పొలం పనులు చేస్తుండగా ఆ రైతుకు వజ్రం దొరికింది. అది అలాంటి ఇలాంటి వజ్రం కాదు.. దాని విలువ రెండు కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని వ్యాపారులు అంటున్నారు. నిజానికి అంతకంటే ఎక్కువ కూడా ఉండవచ్చు. రైతుకు వజ్రం దొరికిందన్న వార్త తెలియగానే అతడి ఇంటి ముందు వ్యాపారాలు క్యూలు కట్టారు. చివరికి రెండు కోట్ల రూపాయలిచ్చి ఆ వజ్రాన్ని గుత్తికి చెందిన వజ్ర వ్యాపారి సొంతం చేసుకున్నాడు. అంత విలువైన వజ్రం దొరికిందనేసరికి జనం పొలాల్లో వెదుకులాట మొదలు పెట్టారు. ఎవరి అదృష్టం ఎలా ఉందో..?

Updated On 6 Jun 2023 1:37 AM GMT
Ehatv

Ehatv

Next Story