యువతకు శిక్షణ పేరిట అందినంత దోచుకున్నారని మాజీ మంత్రి కుర‌సాల కన్నబాబు(Kurasala Kannababu) అన్నారు. స్కిల్ స్కాం(Skill development Scam) పై అసెంబ్లీలో ఆయ‌న మాట్లాడుతూ.. ఒకే కంపెనీకి మొత్తం సొమ్మును బదలాయిస్తే దొరికిపోతామని, ఎక్కువ డొల్ల కంపెనీలకి సొమ్మును మళ్లించారని వివ‌రించారు. ముందుగా స్కిల్ డెవలప్మెంట్ నుండి రూ. 371.25 కోట్లను డిజైన్ టెక్ కి పంపారు.

యువతకు శిక్షణ పేరిట అందినంత దోచుకున్నారని మాజీ మంత్రి కుర‌సాల కన్నబాబు(Kurasala Kannababu) అన్నారు. స్కిల్ స్కాం(Skill development Scam) పై అసెంబ్లీలో ఆయ‌న మాట్లాడుతూ.. ఒకే కంపెనీకి మొత్తం సొమ్మును బదలాయిస్తే దొరికిపోతామని, ఎక్కువ డొల్ల కంపెనీలకి సొమ్మును మళ్లించారని వివ‌రించారు. ముందుగా స్కిల్ డెవలప్మెంట్ నుండి రూ. 371.25 కోట్లను డిజైన్ టెక్ కి పంపారు. అక్కడి నుండి పీవీఎస్పీ అనే షెల్ కంపెనీకి రూ.241 కోట్లు పంపారు. ఆ సొమ్మును డ్రా చేయడానికి దాదాపుగా మరొక 12 డొల్ల కంపెనీలు.. ఏసీఐ, కెడెన్స్, పోలరిష్, నాలెడ్జ్ పొడియం, ఈటీఏ, పాట్రిక్, ఐటీ స్మిత్, భారతీయ గ్లోబల్, ఫారిన్ కంప్యూటర్స్ ఇలా కొన్నింటిని రిజిష్టర్ చేశారని వివ‌రించారు.

90 శాతం నిదులు ఒక కంపెనీ పెట్టి, 10 శాతం నిధులను ప్రభుత్వం పెడితే కొన్ని నిబంధ‌నలను రూపొందించుకోవాలి. ఆ కంపెనీ పెట్టిన నిధుల శాతాన్ని బట్టి ప్రభుత్వం విడతల వారిగా ఆ రేషియోనుబట్టి నిధులను విడుదల చేసేవిధంగా నిబంధ‌నలు ఉండాలి. కానీ స్కిల్ స్కాములో ఇవేమీ పాటించకుండా పరుగులుపెట్టి నిధులు విడుదల చేశారని పేర్కొన్నారు.

సీఎం ఆదేశాలు ఉన్నందున ఆ సొమ్మును వెంటనే మంజూరు చేయాలని.. అప్పట్లో పీవీ రమేష్ అనే ఒక ఐఏఎస్ అధికారి ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నపుడు ఒక నోట్ రాసారు. ఇదే డిపార్ట్ మెంట్ లో సునీత అనే మరొక ఐఏఎస్ అధికారి దీనిపై స్పందిస్తూ.. అసలు ఈ ఫైల్ అనేది ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ కి రాలేదు. ఫైనాన్స్ అనుమతులే లేవు. మీరెలా సొమ్మును ఇవ్వాలంటున్నారు.? పైగా రాష్ట్ర ఆర్ధిక పరిస్దితి అంతంతమాత్రంగా ఉంది. ఈ సమయం లో ఇంత పెద్ద మొత్తాన్ని ఒకేసారి స్కిల్ డెవెలప్మెంట్ కింద ఖర్చు చేయడమెందుకు.? ముందుగా కొంత మొత్తాన్ని ఖర్చుచేసి ఒక పైలెట్ ప్రాజెక్టు కింద తీసుకుని దాని ఫలితాలను చూశాక ముందుకు వెళ్లవచ్చని ఆమె రాశారు. ఇలా అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయం నుండి అధికారులపై ఒత్తిడి వచ్చినపుడల్లా.. ఎందరో అధికారులు అప్పట్లో ఇలా మంచి మంచి సూచనలిచ్చారు. బహుసా అప్పట్లోనే ఇందులో ఏదో స్కాం ఉందని అధికారులు గ్రహించారు కనుకే వారు తమ అభ్యంతరాలను రాసి ఉండవచ్చని క‌న్న‌బాబు అన్నారు.

ఇప్పుడు ఈ స్కాములో పాత్రదారిగా ఉన్న బాబును అరెస్ట్(Chandrababu) చేస్తే.. బాబుపై జగన్(Jagan) కక్షతో ఇలా చేశారని కొందరంటున్నారు. వాస్తవానికి ఈ స్కిల్ స్కాంను జీఎస్టీ ఎన్ ఫోర్స్మెంట్(GST Enforcement) 2017 లో మొదట బయట పెట్టిందని తెలిపారు. ఇదెలా బయటకు వచ్చిందంటే.. చంద్రబాబు కక్కుర్తికి పరాకాష్ట కాబట్టి వీరు కొట్టేసిన డబ్బులకు టాక్స్ ను తిరిగి మాకివ్వాలని ప్రయత్నించగా.. అసలు ఈ కంపెనీలేంటి.? వీటి సంగతేంటని అప్పట్లో జీఎస్టీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దీనిపై దృష్టిపెట్టగా.. ఈ స్కాం బయటపడింది. దీంతో అడ్దంగా బాబు బ్యాచ్ దొరికిపోయిందని వివ‌రించారు.

ఇవన్నీ గమనించి.. నిధులను డొల్ల కంపెనీలకి మళ్ళించారని.. దీనిని మీరు కాస్త సరిచూసుకోవాలంటూ విజిల్ బ్లోయర్ గా అప్పటి బాబు ప్రభుత్వాన్ని జీఎస్టీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ 2018 లో హెచ్చరించింది. అలా హెచ్చరించాక సచివాలయంలో దీనికి సంబంధించిన నోట్ ఫైల్స్‌ను బాబు బ్యాచ్ మాయం చేసిందన్నారు. అసలు ఫైల్స్ ను అలా బాబు బ్యాచ్ మాయం చేయగా.. వీటికి సంబందించిన షాడో ఫైల్స్ అక్కడక్కడా ఉండడంతో ఇప్పటి ఏపీ ప్రభుత్వం వాటిని పట్టుకుందన్నారు.

ఇప్పుడు సభలో టీడీపీ సభ్యులు విజిల్స్ వేస్తున్నారు.. జీఎస్టీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ 2018 లో వేసిన విజిల్స్ వీరికి వినబడలేదని ఎద్దేవా చేశారు. అప్పట్లో చంద్రబాబు మొత్తం కేబినెట్ నే తప్పు బట్టించారని అన్నారు. కేబినెట్ అనుమతులు మంజూరు చేసేది ఒకటయితే.. ఎంఓయూ చేసుకునేది మరొకటి.. ఈ ఎంఓయూ కూడా చాలా చిత్రంగా ఉందని వివ‌రించారు. దీనిని కుదుర్చుకున్న సుమన్ బోస్ మాట్లాడుతూ.. ఆ ఎంఓయూ మీద తేదీ ఎందుకు లేదని అడిగితే.. ఆ సమయానికి కరెంటు పోయిందంటున్నాడు. రూ.3,300 కోట్లకి సంబంధించిన విషయంలో కరెంటును తీసేసి మరీ ఒప్పందాలు కుదుర్చుకున్నారంటే.. ఇదెంత చీకటి యవ్వారమోనని.. మనకు ఇట్టే అర్ధమైపోతుంది అని దుయ్య‌బ‌ట్టారు.

అంతటి విజనరీ కదా చంద్రబాబు.? అలా చీకట్లో సంతకాలు పెట్టుకోవాల్సిన గత్యంతరమేముంది ? అని ప్ర‌శ్నించారు. ఇలా చెప్పడం కంటే సిగ్గుమాలిన చర్య మరొకటి ఉందా.? పోనీ నిజంగానే కరెంటు పోయిందనుకుందాం.. ఇప్పుడు ఏ క్షణమయినా కరెంటు ఆగితే.. మనం వెంటనే మన సెల్ ఫోన్లో ఉన్న లైటును వెలిగిస్తాం కదా.? మరి సెల్ ఫోన్ ని కనిపెట్టిన బాబుకు ఆ ఐడియా ఎందుకు రాలేదో ఆశ్చర్యంగా ఉందని క‌న్న‌బాబు అన్నారు.

Updated On 22 Sep 2023 2:37 AM GMT
Ehatv

Ehatv

Next Story