Chandra Babu, Lokesh : కుప్పంలో చంద్రబాబు, లోకేష్ దిష్టి బొమ్మలు దగ్ధం..
నారా లోకేష్ (Nara Lokesh) దళితులపై చేసిన అనుచిత వాక్యాలను నిరసిస్తూ కుప్పం మున్సిపల్ మొదటి వైస్ చైర్మన్ మునస్వామి ఆధ్వర్యంలో దళిత సంఘాలు నిరసన తెలిపాయి.. నారా చంద్రబాబు (Chandrababu), నారా లోకేష్ (Nara Lokesh) దిష్టిబొమ్మలు ఏర్పాటు చేసి కుప్పం కొత్తపేట నుంచి కుప్పం ఆర్టిసి బస్టాండ్ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు..

chandrababu lokesh
నారా లోకేష్ (Nara Lokesh) దళితులపై చేసిన అనుచిత వాక్యాలను నిరసిస్తూ కుప్పం మున్సిపల్ మొదటి వైస్ చైర్మన్ మునస్వామి ఆధ్వర్యంలో దళిత సంఘాలు నిరసన తెలిపాయి.. నారా చంద్రబాబు (Chandrababu), నారా లోకేష్ (Nara Lokesh) దిష్టిబొమ్మలు ఏర్పాటు చేసి కుప్పం కొత్తపేట నుంచి కుప్పం ఆర్టిసి బస్టాండ్ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి, అంబేద్కర్ విగ్రహం ఎదుట చంద్రబాబు, లోకేష్ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు.. అనంతరం చిత్తూరు ఎమ్మెల్సీ భరత్ (MLC Barath) మాట్లాడుతూ.. నారా లోకేష్ దళితులను అవమానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. నారా లోకేష్ దళితులను హేళన చేయడం సరికాదన్నారు.. వైసిపి పాలనలో దళితులకు పెద్దపీట వేసింది వైఎస్ఆర్ సీపీ అన్నారు..
