Kumari Aunty : ఆంధ్రలో కుమారి ఆంటి ప్రచార జోరు
ఏపీలో రేపటితో ప్రచారానికి(Election campaign) శనివారం సాయంత్రంతో గడువు ముగియనుంది. అన్ని రాజకీయపార్టీలు ఎవరి అస్త్రాలు వారు ప్రయోగిస్తున్నారు. అన్ని పార్టీలు పలువురు సినీ, టీవీ నటులతో పాటు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లను ప్రచారానికి వాడుకుంటున్నారు. తెలంగాణలో ఫేమస్ అయిన కుమారీ ఆంటీ(Kumari aunty) కూడా ప్రచారంలోకి దిగింది. హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జి(Cable bridge) ప్రాంతంలో స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం చేస్తున్న ఆమె పాపులరయింది.
ఏపీలో రేపటితో ప్రచారానికి(Election campaign) శనివారం సాయంత్రంతో గడువు ముగియనుంది. అన్ని రాజకీయపార్టీలు ఎవరి అస్త్రాలు వారు ప్రయోగిస్తున్నారు. అన్ని పార్టీలు పలువురు సినీ, టీవీ నటులతో పాటు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లను ప్రచారానికి వాడుకుంటున్నారు. తెలంగాణలో ఫేమస్ అయిన కుమారీ ఆంటీ(Kumari aunty) కూడా ప్రచారంలోకి దిగింది. హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జి(Cable bridge) ప్రాంతంలో స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం చేస్తున్న ఆమె పాపులరయింది. యూట్యూబ్ ఛానెల్స్ ఆమె వ్యాపారాన్ని విపరీతంగా ప్రమోట్ చేయడంతో ఫుడ్ లవర్స్ ఫోటెత్తారు. పలువురు సెలబ్రిటీలు ఆమె ఫుడ్ తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో జనాల రద్దీ పెరగడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. దీంతో కుమారి ఆంటీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి రోడ్లపై భోజనం అమ్మడానికి వీల్లేదని ఆదేశాలిచ్చారు. మరో ప్రాంతానికి ఫుడ్ స్టాల్ మార్చాలని చెప్పారు. దీంతో పోలీసులతో ఆమె వాగ్వాదం చేసింది. తన పొట్ట కొడుతున్నారని ఆవేదన చెందింది. తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. ఇక ఇదే విషయం సీఎం రేవంత్(Cm revanth Reddy) దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించి అదే ప్రాంతంలో ఫుడ్ స్టాల్ పెట్టుకునేందుకు పోలీసులు సహకరించాలని సూచించారు. ఆ మేరకు డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు.
తాజాగా ఏపీ ఎన్నికల వేళ కుమారి ఆంటీ మరోసారి వార్తల్లో నిలిచింది. ఆమె సొంత ఊరు గుడివాడ కావడంతో అక్కడ టీడీపీ(TDP) అభ్యర్థి తరఫున ఆమె ప్రచారం చేస్తోంది. గుడివాడలో(Gudiwada) టీడీపీ నుంచి బరిలో ఉన్న కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాముకు(Venigandla Ramu) కుమారి ఆంటి మద్దతు ఇస్తున్నారు. గుడివాడ పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంది. వెనిగండ్ల రాము గురించి మాట్లాడుతూ 'ఆయన మహర్షి సినిమాలో మహేష్‌బాబులా మంచి మనసున్న వ్యక్తి అని.. ఆ సినిమాలో మహేష్‌బాబు ప్రజల కోసం సేవ చేస్తే.. గుడివాడలో రియల్‌గా వెనిగండ్ల రాము ప్రజలకు సర్వీస్ చేస్తున్నారని అన్నారు'. గత 15 ఏళ్లుగా గుడివాడలో అభివృద్ధే లేదని.. ఇక్కడ ఉపాధి లేక తమలాంటి వారు పక్కరాష్ట్రానికి వెళ్లాల్సి వచ్చిందని చెప్పింది. గుడివాడలో కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాము, మచిలీపట్నంలో జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరిని గెలిపించాలని ప్రజలను ఆమె కోరింది.