వివేకానందరెడ్డి(Vivekanand Reddy) హత్య కేసును(Murder case) సిట్‌ వన్‌, సిట్‌ 2 విచారించి ఇచ్చిన నివేదకలు కుటుంబం చుట్టూనే తిరిగాయి. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి(YS Rajashekar Reddy) కుటుంబంలోని కొందరు వ్యక్తులు ఆడిన క్రీడకు అభంశుభం తెలియని కొంతమంది బలయ్యారు. వివేకా కేసులో ఆయన కూతురు, అల్లుడిపై చార్జ్‌షీట్‌(Charge sheet) దాఖలైన విషయంపై ప్రముఖ విశ్లేషకులు కె.ఎస్‌.ప్రసాద్‌ ఏమన్నారంటే(KS Prasad).'

వివేకానందరెడ్డి(Vivekanand Reddy) హత్య కేసును(Murder case) సిట్‌ వన్‌, సిట్‌ 2 విచారించి ఇచ్చిన నివేదకలు కుటుంబం చుట్టూనే తిరిగాయి. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి(YS Rajashekar Reddy) కుటుంబంలోని కొందరు వ్యక్తులు ఆడిన క్రీడకు అభంశుభం తెలియని కొంతమంది బలయ్యారు. వివేకా కేసులో ఆయన కూతురు, అల్లుడిపై చార్జ్‌షీట్‌(Charge sheet) దాఖలైన విషయంపై ప్రముఖ విశ్లేషకులు కె.ఎస్‌.ప్రసాద్‌ ఏమన్నారంటే(KS Prasad).'వైఎస్‌ కుటుంబసభ్యులు ఆడిన పైశాచిక క్రీడలో వివేకానందరెడ్డి పీఏ రామకృష్ణారెడ్డి తీవ్రమైన ఇబ్బందులపాలయ్యారు. మూడున్నర దశాబ్దాలపాటు వివేకాకు అంతరంగికుడిగా ఉంటూ ఆయన కష్ట సుఖాలలో పాలుపంచుకున్నారు. జీతం కూడా తీసుకోకుండా సేవ చేశారు. వివేకా హత్య విషయం తెలుసుకుని మొదట పోలీసులకు ఫిర్యాదు చేసింది అవినాష్‌ రెడ్డినే. దస్తగిరి, గంగిరెడ్డి చెప్పిన మాటలకు సిట్‌ ప్రభావితం అయ్యింది. నిందితులు తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్లారని మొదటి నుంచి చెబుతున్నాను. దస్తగిరి, సునీల్ యాదవ్‌ తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్లిన తర్వాత వివేకాను హత్య చేసి, నగదు నట్ర దోచుకున్నారు. కొన్ని ముఖ్యమైన పత్రాలను కూడా తీసుకెళ్లారు. ఇవన్నీ తెలిసి కూడా సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌ తన సొంత శైలిలో విచారణ చేశారు. కృష్ణారెడ్డిని అనుమానించి ఆయనపై థర్డ్‌ డిగ్రీని ప్రయోగించారు. కొడుకు పెళ్లి కూడా ఆగిపోవడానికి కారకుడయ్యారు' అని ప్రసాద్‌ చెప్పుకొచ్చారు. ఇంకా కె.ఎస్‌. ప్రసాద్‌గారు చెప్పిన సంచలన విషయాలేమిటో ఈ వీడియోలో చూడండి..

Updated On 30 Dec 2023 4:16 AM GMT
Ehatv

Ehatv

Next Story