గత ఎన్నికల్లో టీడీపీని(TDP) బొంద పెట్టించిన ప్రశాంత్ కిషోర్‌ను(Prashanth Kishore) ఇప్పుడు టీడీపీ ఎలా తెచ్చుకుంటుదని 'ఈహ'(Eha Tv) చానెల్ డిబేట్‌లో కె.ఎస్.ప్రసాద్(KS Prasad) ప్రశ్నించారు. టీడీపీ వ్యవహారశైలిపై ఆ పార్టీలోని సీనియర్లంతా మదనపడుతున్నారని ఆయన అన్నారు.

KS Prasad
గత ఎన్నికల్లో టీడీపీని(TDP) బొంద పెట్టించిన ప్రశాంత్ కిషోర్‌ను(Prashanth Kishore) ఇప్పుడు టీడీపీ ఎలా తెచ్చుకుంటుదని 'ఈహ'(Eha Tv) చానెల్ డిబేట్‌లో కె.ఎస్.ప్రసాద్(KS Prasad) ప్రశ్నించారు. టీడీపీ వ్యవహారశైలిపై ఆ పార్టీలోని సీనియర్లంతా మదనపడుతున్నారని ఆయన అన్నారు. బీజేపీ కబంధ హస్తాల్లో టీడీపీ నలిగిపోనుందని.. టీడీపీని కనుమరుగుపర్చడమే బీజేపీ లక్ష్యమని.. ఈ కుట్రలో భాగంగానే ప్రశాంత్ కిషోర్‌ను టీడీపీ మీదికి పంపించారన్నారు. టీడీపీని పుట్టి ముంచేందుకే ప్రశాంత్ కిషోర్ వచ్చాడన్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించారని.. అలాంటి పార్టీ ఇప్పుడు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మాట్లాడొద్దని సర్క్యులర్ ఇవ్వడమే ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు. అందరూ కలిసి జగన్‌పై దుమ్మెత్తిపోయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని కె.ఎస్.ప్రసాద్ అంటున్నారు.
