Shyamaladevi : రెబల్ స్టార్ సతీమణితో 'రెబల్'కు చెక్ పెట్టనున్న వైసీపీ..?
దివంగత హీరో, రెబల్ స్టార్ కృష్ణంరాజు కుటుంబం ఎప్పటినుంచో రాజకీయాలలో ఉంది. కృష్ణంరాజు 1991లోనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. తాజాగా ఆయన సతీమణి, ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
దివంగత హీరో, రెబల్ స్టార్ కృష్ణంరాజు(Rebelstar Krishnamraju) కుటుంబం ఎప్పటినుంచో రాజకీయాలలో ఉంది. కృష్ణంరాజు 1991లోనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. తాజాగా ఆయన సతీమణి, ప్రభాస్(Prabhas) పెద్దమ్మ శ్యామలాదేవి(Shyamaldevi) త్వరలో పొలిటికల్ ఎంట్రీ(Political Entry) ఇవ్వబోతున్నారనే వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం(Narsapuram) లోక్‌సభ నియోజకవర్గం నుంచి శ్యామలాదేవి పోటీ చేసే అవకాశం ఉందనేది వార్తల సారాంశం. ప్రస్తుతం రఘు రామకృష్ణంరాజు నర్సాపురం ఎంపీగా ఉన్నారు. ఆయన గత ఎన్నికలలో వైసీపీ(YSRCP) నుంచి గెలిచినా.. ఆ పార్టీకి రెబల్(Rebal)గా మారారు.
దీంతో వైసీపీ కొత్త అభ్యర్థి వేట మొదలుపెట్టింది. అందులో భాగంగానే క్షత్రియ సామాజికవర్గానికే చెందిన శ్యామలాదేవిని బరిలో ఉంచి.. అదే సామాజికవర్గానికి చెందిన రఘు రామకృష్ణంరాజు(Raghuramakrishna Raju)కు చెక్ పెట్టాలని వైసీపీ అధిష్టానం భావిస్తోందట. అయితే ఈ ఊహాగానాలపై అటు వైసీపీ వర్గాల నుంచి గానీ.. ప్రభాస్ ఫ్యామిలీ నుంచి గానీ ఎవరూ స్పందించలేదు. ప్రభాస్ ఫ్యామిలీకి వైసీపీతో మంచి అనుబంధం ఉంది. ఊహాగానాలు నిజమై పోటీకి శ్యామలాదేవి ఒప్పుకుంటే.. రఘు రామకృష్ణంరాజు ఓటమి ఖాయమని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
ఇదిలావుంటే.. కృష్ణంరాజు మొదట కాంగ్రెస్ పార్టీ(Congress)లో 1991లో చేరారు. అదే ఏడాది నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీచేసి టీడీపీ అభ్యర్థి భూపతిరాజు విజయకుమార్ రాజు(Bhupatiraju Vijayakumar Raju) చేతిలో ఓడిపోయాడు. ఆ తర్వాత కొద్దికాలం రాజకీయాలకు దూరమై సినిమాలకు పరిమితమయ్యారు. 1998 ఎన్నికలకు ముందు బీజేపీ చేరి కాకినాడ లోక్‌సభ(Kakinada Loksaba) నియోజకవర్గం నుండి విజయం సాధించి లోక్‌సభలో అడుగుపెట్టారు. 1999 మధ్యంతర ఎన్నికలలో నర్సాపురం లోక్‌సభ నుండి అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి కనుమూరి బాపిరాజు(Kanumuri Bapiraju)పై గెలుపొంది.. కేంద్రంలో వాజపేయి నేతృత్వంలోని ఎన్.డి.ఏ. ప్రభుతంలో 2000 సెప్టెంబర్ 30న నుండి 2001 జులై 22 వరకు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా, 2001 జులై 1 నుండి 2003 జనవరి 29 వరకు వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణి శాఖ సహాయ మంత్రిగా, 2003 జనవరి 29 నుండి 2004 మే 22 వరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. 2004 లోక్‌సభ ఎన్నికలలో మళ్ళీ అదే స్థానం నుండి బీజేపీ తరఫున పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి చేగొండి వెంకట హరిరామజోగయ్య(Harramajogaiah) చేతిలో ఓడిపోయారు. మార్చి 2009లో బీజేపీ(BJP)ని వీడి చిరంజీవి(Chiranjeevi) నేతృత్వంలోని ప్రజారాజ్యం(Prajarajyam) పార్టీలో చేరారు. 2009లో రాజమండ్రి నియోజకవర్గం నుంచి పీఆర్పీ అభ్యర్ధిగా లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో.. రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత 2014లో తిరిగి బీజేపీ పార్టీలో చేరారు. అప్పటినుంచి 2022లో మరణించే వరకూ కృష్ణంరాజు బీజేపీలోనే కొనసాగారు.