Shyamala Devi : కృష్ణంరాజు భార్య రాజకీయ ప్రవేశం ఎప్పుడంటే...!
దిగ్గజ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు(Krishnam Raju) జయంతి(Death anniversary) ఇవాళ! నటనారంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన నటులలో కృష్ణంరాజు ఒకరు. పాలిటిక్స్‌లో ఆయన అనేక ఆటుపోట్లను చవిచూశారు. నర్సాపురం(Narsapuram) లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించారు. ప్రధానమంత్రి వాజపేయి మంత్రివర్గంలో చోటు కూడా సంపాదించారు.

Shyamala Devi
దిగ్గజ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు(Krishnam Raju) జయంతి(Birth anniversary) ఇవాళ! నటనారంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన నటులలో కృష్ణంరాజు ఒకరు. పాలిటిక్స్‌లో ఆయన అనేక ఆటుపోట్లను చవిచూశారు. నర్సాపురం(Narsapuram) లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించారు. ప్రధానమంత్రి వాజపేయి మంత్రివర్గంలో చోటు కూడా సంపాదించారు. బీజేపీలో(BJP) చాన్నాళ్ల పాటు ఉన్న కృష్ణంరాజు తర్వాతి కాలంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అయితే ఎక్కువకాలం ఆ పార్టీలో ఉండలేకపోయారు. ఇప్పుడు ఆయన సతీమణి శ్యామలాదేవి(shyamla Devi) రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) తరపున నర్సాపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తారని అంటున్నారు. నిన్నటి వరకు ఈ విషయంపై శ్యామలా దేవి స్పందించలేదు. ఇవాళ కృష్ణంరాజు జయంతి సందర్భంగా ఆయన స్వగ్రామం మొగల్తూరులో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ క్యాంప్ నిర్వహణను స్వయంగా చూసుకుంటున్న శ్యామలాదేవి రాజకీయ ప్రవేశంపై మాట్లాడారు. కృష్ణంరాజు మార్గంలో నడుస్తూ ఆయన ఆశయాల సాధనకు కృషి చేస్తానని చెప్పారు. పేదలకు విద్య, వైద్యం అందేలా చూడాలని కృష్ణంరాజు ఎంతగానో తపనపడేవారని, అందుకే ఆయన జయంతి సందర్భంగా మొగల్తూరులో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతానికి తన ఆలోచన అంతా నిరుపేదలకు వైద్యం అందించడంపైనే ఉందని చెబుతూ జయంతి వేడుకలు, హెల్త్ క్యాంప్ విజయవంతంగా పూర్తయ్యాక తన రాజకీయ ప్రవేశంపై జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తానని ఆమె వివరించారు.
