Posani Krishnamurali : అవన్నీ చేసింది ప్రజల కోసమేనా తల్లీ..? : భువనేశ్వరికి పోసాని ప్రశ్నలు
చంద్రబాబు భార్య నారా భువనేశ్వరిపై పోసాని కృష్ణమురళి సెటైర్లు సంధించారు. పోసాని మాట్లాడుతూ..

Krishna Murali’s questions to Chandrababu’s wife Bhuvaneshwari
చంద్రబాబు(Chandrababu) భార్య నారా భువనేశ్వరి(Nara Bhuvaneshwari)పై పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali) సెటైర్లు సంధించారు. పోసాని మాట్లాడుతూ.. శిక్ష పడి భర్త జైలుకి వెళ్తే.. అతడి వల్ల పరువు పోయిందని భార్య బాధపడుతుంది. తిరిగిచ్చాక అయినా బుద్ధిగా ఉండమని భర్తకు సర్ధి చెబుతుంది. కానీ భువనేశ్వరి మేడమ్ మాత్రం.. జైలులో చంద్రబాబును కలిసివచ్చాక.. మా ఆయన ఈ జైలు కట్టాడు.. ఆ జైలులోనే మా ఆయనను పెట్టారు. మా ఆయన ఎప్పుడూ ప్రజల కోసమే ఆలోచిస్తుంటారు. ఆయన జీవితమంతా ప్రజల కోసమే ధారపోశారని అన్నారు. అమ్మా.. మేడమ్.. మీ ఆయన ప్రజల కోసమే ఆలోచిస్తే.. కాంగ్రెస్(Congress) చంద్రబాబుకు ఎమ్మెల్యే సీటు, మంత్రి పదవి ఇచ్చింది. అయినా ఆయన టీడీపీ(TDP)లోకి ఎందుకొచ్చారు.? ప్రజల కోసమా తల్లీ..? అంటూ ప్రశ్నించారు. ఎన్టీఆర్(NTR)ను చెప్పుతో కొట్టించారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి.. టీడీపీని కబ్జా చేశారు. మీ తండ్రి ఎన్టీఆర్ కూర్చోవాల్సిన సీట్లో.. మీ ఆయన కూర్చున్నారు. ఇదీ కూడా ప్రజల కోసమేనా అమ్మా.? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ(Telangana)లో కేసీఆర్(KCR) రాజకీయ జీవితాన్ని నాశనం చేయడానికి.. ఎమ్మెల్యేను కొనేందుకు ఓటుకు నోట్లు ఇస్తూ వీడియోలు, ఆడియోలతో దొరికారు కదా.. ఇది కూడా ప్రజల కోసమేనా అమ్మా.. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమా తల్లీ.? అంటూ ప్రశ్నించారు.
