సీఎం వైఎస్ జగన్(CM YS Jagan)ను మంగళవారం క్యాంప్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ(Kottu Satyanarayana) కలిశారు. విజయవాడ(Vijayawada) ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం(Indira Gandhi Stadium)లో ఈ నెల 12 నుంచి 17 వరకు శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం జరుగనున్న నేపథ్యంలో సీఎం జగన్ ను కార్యక్రమానికి ఆహ్వానించారు.
సీఎం వైఎస్ జగన్(CM YS Jagan)ను మంగళవారం క్యాంప్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ(Kottu Satyanarayana) కలిశారు. విజయవాడ(Vijayawada) ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం(Indira Gandhi Stadium)లో ఈ నెల 12 నుంచి 17 వరకు శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం(Sri Lakshmi Maha Yagnam) జరుగనున్న నేపథ్యంలో సీఎం జగన్ ను కార్యక్రమానికి ఆహ్వానించారు. డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ వెంట సీఎంను కలిసిన వారిలో దేవదాయ శాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ, వేద పండితులు ఉన్నారు. ఏపీ ప్రభుత్వం–దేవదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో అష్టోత్తర శతకుండాత్మక (108) చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం నిర్వహిస్తున్నారు.
అలాగే.. శ్రీశైలం(Srisailam)లో జరగనున్న మహాకుంభాభిషేక మహోత్సవాని(Kumbhabhishek Mahatsavam)కి హాజరుకావాలని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, శ్రీశైలం ఎమ్మెల్యేశిల్పా చక్రపాణి రెడ్డి(Silpa Chakrapani Reddy), శ్రీశైల దేవస్ధానం ఛైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, దేవదాయ శాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ, ఈవో లవన్న, వేద పండితులు సీఎం జగన్‌ను ఆహ్వానించారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు తీర్ధప్రసాదాలు అందజేసి వేదమంత్రాలతో ఆశీర్వచనం ఇచ్చారు వేదపండితులు. శ్రీశైలంలో ఈ నెల 25 నుంచి 31 వరకు మహారుద్ర శతచండీ వేదస్వాహాకార పూర్వక మహాకుంభాభిషేక మహోత్సవం జరుగనుంది.