మహాశివరాత్రి(Mahashiv Ratri) పండుగ రోజున కోటప్ప కొండ(Kotappa hill) లక్షలాది భక్తులతో నిండిపోతుంది. ఇక్కడ పరమేశ్వరుడు త్రికోటేశ్వరస్వామిగా వెలిశారు. పరమేశ్వరుడు జ్ఞానోపదేశం ఇచ్చిన పవిత్ర పుణ్యక్షేత్రమే కోటప్పకొండ అని భక్తుల విశ్వాసం. గుంటూరు జిల్లా నరసరావుపేట(Narasaraopet) సమీపంలో కోటప్పకొండ గ్రామంలో త్రికోటేశ్వరస్వామి ఆలయం ఉంది. మహాశివరాత్రి పర్వదినాల్లో ఇసుకేస్తే రాలనంత మంది ఇక్కడికి వస్తారు.

మహాశివరాత్రి(Mahashiv Ratri) పండుగ రోజున కోటప్ప కొండ(Kotappa hill) లక్షలాది భక్తులతో నిండిపోతుంది. ఇక్కడ పరమేశ్వరుడు త్రికోటేశ్వరస్వామిగా వెలిశారు. పరమేశ్వరుడు జ్ఞానోపదేశం ఇచ్చిన పవిత్ర పుణ్యక్షేత్రమే కోటప్పకొండ అని భక్తుల విశ్వాసం. గుంటూరు జిల్లా నరసరావుపేట(Narasaraopet) సమీపంలో కోటప్పకొండ గ్రామంలో త్రికోటేశ్వరస్వామి ఆలయం ఉంది. మహాశివరాత్రి పర్వదినాల్లో ఇసుకేస్తే రాలనంత మంది ఇక్కడికి వస్తారు. ఆలయాన్ని క్రీస్తుశకం 1172లో నిర్మించారని శాసనాల ద్వారా తెలుస్తోంది. విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు(Shri krishna Devarayalu) ఈ ఆలయానికి పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారని శాసనాలు చెబుతున్నాయి. 1587 అడుగుల ఎత్తున్న కోటప్ప కొండపై త్రికోటేశ్వరస్వామి ఆలయం ఆరు వందల అడుగుల ఎత్తులో ఉంది. ఈ కొండను ఎక్కడ్నుంచి చూసినా మూడు శిఖరాలు కనిపిస్తాయి. అందుకే ఈ క్షేత్రానికి త్రికూటాచలమని పేరు వచ్చింది. ఈ శిఖరాలు బ్రహ్మ, విష్ణు, రుద్ర రూపాలని చెబుతుంటారు. ఈ ఆలయానికి ఓ స్థల పురాణం ఉంది. దక్షయజ్ఞాన్ని భగ్నం చేసిన తర్వాత శివుడు బాలదక్షిణామూర్తిగా అవతారంలో బాలుడిగా మారతాడు. కైలాసంలో తపమాచరిస్తూ ఉంటాడు. అప్పుడు దేవతలందరిని వెంటపెట్టుకుని దక్షిణామూర్తిని సందర్శిస్తాడు. దేవతలంతా తమకు జ్ఞానబోధ చేయమని పరమశివుడిని వేడుకుంటారు. త్రికూటాచలానికి వస్తే జ్ఞానాన్ని ప్రసాదిస్తానని పరమేశ్వరుడు చెబుతాడు. దాంతో బ్రహ్మతో పాటు ముక్కోటి దేవతలు త్రికూటాచలానికి వస్తారు. అప్పుడు శివుడు త్రికూట కొండపై వెలసి వారికి జ్ఞానబోధ చేస్తాడు. ఆ ప్రదేశంలోనే పాత కోటప్ప గుడి ఉంది. ప్రధాన ఆలయంలోపలి లింగం కేవలం ఒక్క అడుగు మాత్రమే ఉంటుంది.
మహాశివరాత్రి సందర్భంగా ప్రభల ప్రదర్శన అత్యంత వైభవంగా జరుగుతుంది. జంగమయ్య చిత్రాలతో చిన్న ప్రభల నుంచి భారీ ఎత్తున ప్రభలను వూరేగింపుగా తీసుకువస్తారు. కొన్ని ప్రభలు యాభై అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉండటం విశేషం. గతంలో ఎడ్లబండ్లలో తీసుకువచ్చేవారు. ప్రస్తుతం ట్రాక్టర్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు.

Updated On 7 March 2024 6:58 AM GMT
Ehatv

Ehatv

Next Story