తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల(TS assembly Elections) ముందు వరకు వై.ఎస్‌.షర్మిల(YS Sharmila) తెలంగాణ బిడ్డ. తెలంగాణకే తన జీవితం అంకితమనని, తెలంగాణ అభివృద్ధి కోసం తుది శ్వాస వరకు పాటుపడతానని చెప్పిన షర్మిల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు(Andhra Pradesh) మకాం మార్చారు. ప్రస్తుతం ఆమె ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌కు అధ్యక్షురాలు(APCC Chief). కాంగ్రెస్‌ పార్టీకి పూనర్వైభవం సాధించి తీరతానంటూ ప్రతిన చేస్తున్న నాయకురాలు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల(TS assembly Elections) ముందు వరకు వై.ఎస్‌.షర్మిల(YS Sharmila) తెలంగాణ బిడ్డ. తెలంగాణకే తన జీవితం అంకితమనని, తెలంగాణ అభివృద్ధి కోసం తుది శ్వాస వరకు పాటుపడతానని చెప్పిన షర్మిల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు(Andhra Pradesh) మకాం మార్చారు. ప్రస్తుతం ఆమె ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌కు అధ్యక్షురాలు(APCC Chief). కాంగ్రెస్‌ పార్టీకి పూనర్వైభవం సాధించి తీరతానంటూ ప్రతిన చేస్తున్న నాయకురాలు. ఆమె లక్ష్యం కాంగ్రెస్‌కు అధికారంలోకి తీసుకురావడం కాదు , తన అన్న జగన్మోహన్‌రెడ్డిని అధికారంలోకి దించేయడం. ఈ విషయం అందరికీ తెలుసు. ఎలాగైనా సరే జగన్‌ మళ్లీ అధికారంలోకి రాకూడదన్న కసి ఆమెలో కనిపిస్తోంది. షర్మిల వేస్తున్న ప్రతి అడుగు వెనుక చంద్రబాబునాయుడు(Chandrababu) ఉన్నారనే వాదన కూడా వినిపిస్తోంది. తెలంగాణలో ఆమె పార్టీ పెట్టినప్పుడు ఆమెకు చేదోడువాదోడుగా నిలిచిన వ్యక్తి కొండా రాఘవరెడ్డి(Konda raghava reddy). షర్మిలకు కీలకమైన అనుచరుడిగా ఉన్నారు కూడా! ఆమెను నమ్మి వైఎస్‌ఆర్‌ తెలంగాణపార్టీలో చేరిన కొందరు నాయకుల్లాగే కొండ రాఘవరెడ్డి కూడా ఇప్పుడు బాధపడుతున్నారు. ఇప్పుడాయన పాత సంగతులను బయటకు తీసుకువస్తున్నారు. జగన్‌ జైలులో ఉన్నప్పుడు ఆయన వదిలిన బాణమంటూ షర్మిల పాదయాత్ర చేశారు కదా! అప్పుడేం జరిగిందో పూసగుచ్చినట్టు చెప్పుకొచ్చారు రాఘవరెడ్డి.

కొండా రాఘవరెడ్డి చెప్పిన విషయాలను తేలిగ్గా తీసిపారేయ్యడానికి లేదు. ఎందుకంటే వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి అత్యంత విశ్వసనీయమైన వ్యక్తి ఈయన! షర్మిల పార్టీ పెట్టినప్పుడు ఆమె వెన్నంటి నిలిచిన నాయకుడు ఈయన! తర్వాతర్వాత షర్మిలతో విభేదించి బయటకు వచ్చేశారు. రాఘవరెడ్డి బయటకు వచ్చిన తర్వాత ఆయనపై కూడా షర్మిల నిందలు వేశారు. ఆయనెప్పుడూ వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ కార్యకర్త కాదని వ్యాఖ్యలు చేశారు. అవమానాలను భరించిన రాఘవరెడ్డి ఇప్పుడు పాదయాత్ర వెనుక ఉన్న కుట్రకోణాన్ని బయటపెట్టారు. జగన్మోహన్‌రెడ్డి(Jagan Mohan Reddy) జైలులో ఉన్నప్పుడు పార్టీని కాపాడుకోవడానికి, ప్రజలకు దగ్గరవ్వడానికి తల్లి విజయమ్మతో పాదయాత్ర కొనసాగింపచేయాలని జగన్‌ అనుకున్నారట! అయితే తన తల్లికి మోకాళ్ల నొప్పులు ఉన్నాయని చెబుతూ ఆమె పాదయాత్ర చేయకుండా షర్మిల అడ్డుకున్నారట! అటు తర్వాత తన భార్య భారతితో(Bharathi) పాదయాత్ర చేయించాలనుకున్నారు జగన్‌. ఈసారి కూడా షర్మిల ఎంటరయ్యారట! భారతి పాదయాత్రను కూడా ఆమె అడ్డుకున్నారు. తనే పాదయాత్ర చేస్తానని చెప్పారట! అప్పటికే ఆమె మనసులో స్వార్థపూరిత ఆలోచనలు ఉన్నాయని కొండా అన్నారు. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక షర్మిల భర్త అనిల్‌కుమార్‌ వెళ్లి కలిశారట! తనకు ఓ పని చేసి పెట్టాలని అడిగారట! అయితే రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించే ఆ పని చేయడానికి జగన్‌ ఒప్పుకోలేదట! అప్పట్నుంచి షర్మిల-అనిల్‌కుమార్‌ దంపతులు జగన్‌పై పగబట్టారని కొండా రాఘవరెడ్డి తెలిపారు. అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్న అంతరాన్ని పసిగట్టిన కొందరు ఆమెను తమవైపుకు లాగేసుకున్నారని, ఆమెతో కథను నడిపిస్తున్నారని చెప్పుకొచ్చారు. షర్మిలను వెనుక నుంచి నడిపిస్తున్న దుష్ట శక్తులేవో త్వరలోనే ప్రజలకు తెలుస్తుందని కొండా రాఘవరెడ్డి చెప్పారు.

Updated On 27 Jan 2024 1:28 AM GMT
Ehatv

Ehatv

Next Story