కొమ్మినేని శ్రీనివాస్‌రావు (Kommineni SrinivasRao) మళ్లీ సాక్షి లైవ్‌లోకి వస్తున్నారు. పొలిటికల్‌ డిబేట్లకు (Political Debates) ఆయన యాంకరింగ్‌ చేయనున్నారు. KSR లైవ్‌ షో (KSR live Show) పేరుతో ఈనెల 17 నుంచి డిబెట్లు నిర్వహిస్తారని ఆ చానెల్‌లో ప్రోమో ఒకటి వదిలారు.

కొమ్మినేని శ్రీనివాస్‌రావు (Kommineni SrinivasRao) మళ్లీ సాక్షి లైవ్‌లోకి వస్తున్నారు. పొలిటికల్‌ డిబేట్లకు (Political Debates) ఆయన యాంకరింగ్‌ చేయనున్నారు. KSR లైవ్‌ షో (KSR live Show) పేరుతో ఈనెల 17 నుంచి డిబెట్లు నిర్వహిస్తారని ఆ చానెల్‌లో ప్రోమో ఒకటి వదిలారు. ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా (Press Acadamy Chairman) నియమించిన తర్వాత 2022 నవంబర్‌ నుంచి ఈ షో ఆగిపోయింది. అయితే గెస్ట్‌గా వచ్చి వర్తమాన రాజకీయాలను విశ్లేషించేవారు. ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా ఉంటూనే పొలిటికల్‌ వార్తలను విశ్లేషిస్తూ సాక్షి దినపత్రికు కథనాలు అందించేవారు. ఇక ఈనెల 17 నుంచి కొమ్మినేని శ్రీనివాస్‌రావు హోస్ట్‌గా వ్యవహరిస్తూ KSR లైవ్‌ షో మళ్లీ ప్రారంభం అవుతుంది.

కృష్ణా జిల్లా (Krishna Dist) గన్నవరానికి (Gannavaram) చెందిన కొమ్మినేని శ్రీనివాసరావు 1978 నుంచి జర్నలిస్టుగా కొనసాగుతున్నారు. ఈనాడు పత్రికలో (Eenadu Paper) పలు హోదాల్లో 24 ఏళ్లు ఆయన పనిచేశారు. 2002లో ఆంధ్రజ్యోతి (Andhrajyothi) దినపత్రిక పునఃప్రారంభమయ్యాక బ్యూరో చీఫ్‌గా పనిచేశారు. 2007లో NTVలో చేరి లైవ్‌ డిబెట్లలో వ్యాఖ్యతగా వ్యవహరిచారు. ఎన్టీవీలో కొమ్మినేని శ్రీనివాసరావు దాదాపు ఎనిమిదేళ్ల పాటు పని చేసి అక్కడ మానేశారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ (Lokesh) ఎన్టీవీ యాజమాన్యంపై ఒత్తిడి చేయడంతో ఆ చానెల్‌ నుంచి తప్పుకున్నానని కొమ్మినేని పలుసార్లు. ఆ తర్వాత సీఎం జగన్‌ కోరిక మేరకు‘సాక్షి’(Sakshi) ఛానల్‌లో చేరారు. పొలిటికల్ డిబెట్లకు ఆయన వ్యాఖ్యతగా వ్యవహరించేవారు. ఈ క్రమంలోనే కొమ్మినేనికి 2022 నవంబర్‌లో ఏపీ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా సీఎం జగన్‌ నిర్వహించారు. దీంతో ఆయన డిబెట్లకు సాక్షి చానెల్‌లో బ్రేక్‌ పడింది. దాదాపు 14 నెలల తర్వాత కొమ్మినేని లైవ్ డిబెట్ల బాధ్యతను చేపడుతున్నారని తెలుస్తోంది. జనవరి 17 నుంచి కొమ్మినేని 'KSR' పేరుతో లైవ్‌ షోలో పాల్గొంటారని ఆ చానెల్‌ ప్రోమోను విడుదల చేసింది.

Updated On 13 Jan 2024 4:00 AM GMT
Ehatv

Ehatv

Next Story