తెలంగాణ ఎన్నికల్లో(TS elections 2023) కాంగ్రెస్ పార్టీకి మద్దతు పెరుగుతోంది. తాజాగా వైఎస్ఆర్టీపీ(YSRTP) అధినేత్రి వైఎస్ ష‌ర్మిల(YS sharmila) కాంగ్రెస్‌కు(congress) మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తూ ఎన్నిక‌ల‌కు దూరంగా ఉంటున్నామంటూ ప్ర‌క‌టించ‌గా.. పక్క రాష్ట్రం ఏపీకి చెందిన పలువురు నేతలు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు సిద్ద‌మ‌య్యారు.

ఈనెల 30న జరగనున్న తెలంగాణ శాసనసభ ఎన్నికలకు.. ఆంధ్రప్రదేశ్(andhra Pradesh) పరిరక్షణ సమితి అద్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు(Kolikapudi Srinivasa Rao) కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. ఈ మేర‌కు తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డిని(Revanth Reddy) కలిసిన కొలికపూడి శ్రీనివాస్ రావు.. త‌న మ‌ద్ద‌తును తెలియ‌జేశారు. గ్రేటర్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో కొలికపూడి శ్రీనివాసరావు కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్న‌ట్లు తెలుస్తుంది.

జై భీమ్‌ భారత్‌ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్‌కుమార్‌ కూడా తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటంచారు. కాంగ్రెస్‌ పార్టీ మీడియా కమిటీ ఛైర్మన్‌తో పాటు ముఖ్య నాయకులతో ఈ నెల 5న సమావేశం అవుతున్నట్లు తెలిపారు.

Updated On 3 Nov 2023 4:53 AM GMT
Ehatv

Ehatv

Next Story