Kodi Kathi Srinivas : నాపై దయ చూపండి.. సీజేఐకి కోడి కత్తి కేసు నిందితుడు లేఖ
విజయవాడ ఎన్ఐఏ కోర్టులో గురువారం కోడి కత్తి కేసు విచారణ జరిగింది. సీఎం జగన్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించేందుకు సమయం కోరారు. దీంతో ఎన్ఐఏ కోర్టు కేసును జూలై 4వ తారీఖు కు వాయిదా వేశారు.
విజయవాడ(Vijayawada) ఎన్ఐఏ కోర్టు(NIA Court)లో గురువారం కోడి కత్తి కేసు(Kodi Kathi Case) విచారణ జరిగింది. సీఎం జగన్(CM Jagan) తరఫు న్యాయవాది వాదనలు వినిపించేందుకు సమయం కోరారు. దీంతో ఎన్ఐఏ కోర్టు కేసును జూలై 4వ తారీఖు కు వాయిదా వేశారు. ఇదిలావుంటే.. కోడి కత్తి కేసు నిందితుడు శ్రీనివాస్Srinivas) సీజేఐ(CJI)కి లేఖ రాశారు. 1610 రోజులుగా జైలు(Jail)లోనే ఉన్నానని పేర్కొన్న శ్రీనివాస్.. ఇన్నాళ్ళైనా కనీసం బెయిల్(Bail) ఇవ్వలేదని లేఖలో పేర్కొన్నాడు. ఇంకా ఎన్నాళ్లు జైల్లో ఉండాలో కూడా తెలియని పరిస్థితి నెలకొందని.. తనపై దయ చూపాలని సీజేఐని లేఖలో కోరాడు కోడి కత్తి నిందితుడు శ్రీనివాస్.
ఎన్ఐఏ కోర్టుకు పది కిలో మీటర్ల దూరంలోనే సీఎం జగన్ నివాసం ఉంటున్నారు. పదిహేను నిమిషాలు కేటాయిస్తే సాక్ష్యం చెప్పి వెళ్లవచ్చు. ఉద్దేశపూర్వకంగా ఆయన తన న్యాయవాదులతో పిటిషన్లు వేయించారు. ఎలాంటి కుట్ర కోణం లేదని ఎన్ఐఏ అధికారులు స్పష్టం చేశారు. అయినా కొత్తగా పిటిషన్ వేయడం వెనుక వేరే కారణాలు ఉన్నాయని ఆరోపించారు.
లేఖ విషయమై శ్రీనివాస్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. తెలుగులో రాసిన లేఖను ఇంగ్లీషులోకి అనువాదం చేసి పంపిస్తున్నామని చెప్పారు. శ్రీనివాస్ తల్లి సావిత్రి(Savithri) కూడా గతంలో సీజేఐగా ఉన్న జస్టిస్ ఎన్వీ రమణ(NV Ramana)కు ఈ విషయమై లేఖ రాశారు.