✕
Kodi Kathi Srinu : కోడికత్తి శ్రీను పొలిటికల్ ఎంట్రీ..!
By YagnikPublished on 11 March 2024 9:02 PM GMT
వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడైన జనిపల్లి శ్రీనివాసరావు అలియాస్ కోడికత్తి శ్రీను పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన తాజాగా జైభీమ్ భారత్ పార్టీలో చేరారు.

x
Kodi Kathi Srinu Political Entry And Contesting In Elections
వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడైన జనిపల్లి శ్రీనివాసరావు అలియాస్ కోడికత్తి శ్రీను పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన తాజాగా జైభీమ్ భారత్ పార్టీలో చేరారు. విజయవాడలోని జైభీమ్ భారత్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్‌కుమార్ నేతృత్వంలో శ్రీనివాసరావు పార్టీలో చేరారు. జడ శ్రవణ్‌కుమార్.. శ్రీనివాసరావుకు పార్టీ కండువా కప్పి ఆయనను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఇదిలావుంటే.. అమలాపురం నియోజకవర్గం నుంచి కోడికత్తి శ్రీను పోటీ చేసే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి.

Yagnik
Next Story