Kodali Nani comments on Rajinikanth : రజినీకాంత్ ఒక సన్నాసి.. కొడాలి నాని సంచల కామెంట్స్
ఎన్టీఆర్ పై చెప్పులు విసురుతుంటే వైస్రాయ్ హోటల్లో చంద్రబాబుకు మద్దతుగా ఉన్న రజినీకాంత్.. సిగ్గు, శరం లేకుండా ఇప్పుడు చంద్రబాబును పొగుడుతూ ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో ఎలా పాల్గొన్నాడని ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను బ్లాక్ మెయిల్ చేసేందుకే చంద్రబాబు.. రజనీకాంత్‌తో అబద్దాలు చెప్పించారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ ఏది మంచో.. ఏది చెడో గ్రహించుకోవాలని హితవు పలికారు. యుగపురుషుడు ఎన్టీఆర్ జీవించి ఉన్నప్పుడు ఆయన పట్ల రజనీకాంత్ ఎలా ప్రవర్తించాడో అందరికి తెలుసని అన్నారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలను తెలుగు ప్రజలు పట్టించుకోరని కొడాలి నాని అన్నారు.
విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు సూపర్ స్టార్ రజనీ కాంత్ ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. సభలో రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని కౌంటరిచ్చారు. రజనీకాంత్ కు ఏపీ రాజకీయాలపై అవగాహన లేకుండా మాట్లాడారని కొడాలి నాని అన్నారు. మూడు రోజులు షూటింగ్ చేస్తే నాలుగు రోజులు ఆసుపత్రిలో పడుకునే, రజనీకాంత్ ఏం చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ వచ్చాడని ప్రశ్నించారు. 100 ఏళ్లు బతకాల్సిన ఎన్టీఆర్ ను 74 ఏళ్లకే పరిమితం చేసిన వ్యక్తుల కోసం రజనీకాంత్ విజయవాడ వచ్చారని మండిపడ్డారు. రజనీకాంత్ తమిళనాడులో హీరో.. ఇక్కడ జీరో అని ఎద్దేవా చేశారు.
ఎన్టీఆర్ పై చెప్పులు విసురుతుంటే వైస్రాయ్ హోటల్లో చంద్రబాబుకు మద్దతుగా ఉన్న రజినీకాంత్.. సిగ్గు, శరం లేకుండా ఇప్పుడు చంద్రబాబును పొగుడుతూ ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో ఎలా పాల్గొన్నాడని ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను బ్లాక్ మెయిల్ చేసేందుకే చంద్రబాబు.. రజనీకాంత్‌తో అబద్దాలు చెప్పించారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ ఏది మంచో.. ఏది చెడో గ్రహించుకోవాలని హితవు పలికారు. యుగపురుషుడు ఎన్టీఆర్ జీవించి ఉన్నప్పుడు ఆయన పట్ల రజనీకాంత్ ఎలా ప్రవర్తించాడో అందరికి తెలుసని అన్నారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలను తెలుగు ప్రజలు పట్టించుకోరని కొడాలి నాని అన్నారు.
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలలో సూపర్ స్టార్ రజనీకాంత్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్, చంద్రాబాబు తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఎన్టీఆర్ నటించిన ‘పాతాళభైరవి’ సినిమాను 1956-57లో నేను మొదటిసారి చూశానని తెలిపారు. ఎన్టీఆర్‌తో కలిసి ‘టైగర్’ సినిమాలో నటించానని అన్నారు. అప్పుడు నాకు కోపం ఎక్కువ. సెట్‌లో అందరి మీదా అరిచేసేవాడిని.. దాంతో నన్ను ఆ సినిమాలో నుంచి తొలగించాలని కొందరు ఫిర్యాదు చేశారు. అందుకు ఎన్టీఆర్ ఒప్పుకోలేదు. ఆయనకు కోపం వస్తుంటే.. ప్రేమగా చూసుకోండి.. రజనీకాంతే సినిమాలో ఉండాలని చెప్పారని గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ ప్రభావం తనపై చాలా ఉందని, గద పట్టుకుని ఎన్టీఆర్‌ను అనుకరించేవాడినని తెలిపారు. ఎన్టీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకుని సినిమాల్లోకి వచ్చానని అన్నారు.
చంద్రబాబు నాకు 30 ఏళ్లుగా మిత్రుడు.. చంద్రబాబు ఐటీ విజన్ ఏంటో ప్రపంచానికి తెలుసు. చంద్రబాబు పెద్ద విజనరీ.. చంద్రబాబు విలువ ఇక్కడ ఉన్నవాళ్లకంటే.. బయట ఉన్న వాళ్లకే తెలుసు. ఎప్పుడూ అభివృద్ధి గురించే చంద్రబాబు మాట్లాడేవారు. హైదరాబాద్‌లో పర్యటిస్తే ఇండియాలో ఉన్నానా? న్యూయార్క్ లో ఉన్నానో అర్థం కాలేదు. హైదరాబాద్ అభివృద్ధి అవ్వడంతో చంద్రబాబు పాత్ర ఎంతో ఉందని అన్నారు.