టీడీపీ జాతీయ కార్య‌ద‌ర్శి నారా లోకేష్‌పై ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్ర‌స్థాయిలో ఫైర్ అయ్యారు. కృష్ణాజిల్లా గుడివాడలో ఆయ‌న మాట్లాడుతూ..

టీడీపీ జాతీయ కార్య‌ద‌ర్శి నారా లోకేష్‌పై ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్ర‌స్థాయిలో ఫైర్ అయ్యారు. కృష్ణాజిల్లా గుడివాడలో ఆయ‌న మాట్లాడుతూ.. చంద్రబాబు నవ యువకుడు అన్న లోకేష్ వ్యాఖ్యలకు కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. 75 ఏళ్లు వయసు ఉన్న చంద్రబాబుని ముసలోడు కాక ఏమనాలని అన్నారు. లోకేష్ అనేవాడు బ్రెయిన్ లెస్ కిడ్ అని ఎద్దేవా చేశారు.

చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకి పట్టిన నిష్ట దరిద్రుడు లోకేష్ అని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. లోకేష్ పర్ఫామెన్స్ తో.. తెలంగాణలో టీడీపీ తుడిచి పెట్టుకుపోయిందన్నారు. ఎన్టీఆర్ కు, రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు చేసిన మోసాలు, ద్రోహాలు, వెన్నుపోట్లకు దేవుడిచ్చిన గిఫ్ట్‌ లోకేష్ అని వ్యాఖ్యానించారు. శంఖారావం పేరుతో లోకేష్ నిర్వహిస్తున్న సభలు సంక నాకి పోతున్నాయన్నారు. సీఎం జగన్ లా ప్రజలకు చేసిన మేలు, చెయ్యబోయే మంచిని చెప్పుకోలేని చంద్రబాబు ఉత్త పుత్రుడు, దత్తపుత్రుడు, వదినమ్మ, చెల్లెమ్మలతో కలిసి ఎన్నికలకు వస్తున్నాడని ఎద్దేవా చేశారు.

Updated On 20 Feb 2024 8:04 AM GMT
Yagnik

Yagnik

Next Story