Kodali Nani : 'నిజం గెలిచింది' కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నారు
నారా భువనేశ్వరి(Nara Bhuvaneswari) 'నిజం గెలవాలి' యాత్ర(Nijam gelavali yatra) బుధవారం ప్రారంభించారు. భువనేశ్వరి యాత్రపై వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని(Kodali Nani) సెటైర్లు వేశారు. గుడివాడలో మీడియాతో మాట్లాడుతూ..

Kodali Nani
నారా భువనేశ్వరి(Nara Bhuvaneswari) 'నిజం గెలవాలి' యాత్ర(Nijam gelavali yatra) బుధవారం ప్రారంభించారు. భువనేశ్వరి యాత్రపై వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని(Kodali Nani) సెటైర్లు వేశారు. గుడివాడలో మీడియాతో మాట్లాడుతూ.. నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు(Chandrababu) జైల్లో ఉన్నారని.. భువనేశ్వరి కూడా నిజం గెలవాలనుకుంటే.. చంద్రబాబు జీవితంలో బయటకురారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
చంద్రబాబు కుటుంబమంతా అవినీతి సొమ్ముతో మునిగిపోయిందన్నారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఏ స్థితిలో ఉన్నారు..? భువనేశ్వరి ఏ స్థాయిలో ఉన్నారు..? అని ప్రశ్నించారు. రెండు ఎకరాలతో ప్రారంభమైన చంద్రబాబు ప్రస్థానం నేడు రూ.2వేల కోట్లు దాటిందన్నారు. 40 రోజుల్లో ఢిల్లీ లాయర్లకు రూ. 35 కోట్లు ఏ విధంగా ఫీజులు కట్టారు..? అని ప్రశ్నించారు. కష్టపడి పొలం దున్నగా వచ్చిన డబ్బుతోనే ఏడు కోట్లతో రూపొందించిన బస్సులో యాత్ర చేస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు వారసుడు లోకేష్ సమర్థుడు, మగాడు అంటున్నారు. లోకేశ్ సమర్ధుడైతే.. ఇంట్లో మహిళలు రోడ్లపైకి ఎందుకు వస్తారని ప్రశ్నించారు. లోకేష్ పప్పు అని మరోసారి రుజువైందని.. లోకేశ్ ఢిల్లీ పారిపోయి తల్లిని రోడ్లపై తిప్పుతున్నాడంటూ ఎద్దేవా చేశారు.
