Kodali Nani : ఆర్కే వైసీపీలో చేరికపై కొడాలి నాని ఏమన్నారంటే..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేని సీఎం జగన్ తన కుటుంబ సభ్యుడిలా భావించారని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు.

Kodali Nani Comments on joining RK in YCP
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేని సీఎం జగన్ తన కుటుంబ సభ్యుడిలా భావించారని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. సామాజిక సమీకరణాల దృష్ట్యానే.. సొంత మనిషిగా భావించి మంగళగిరిలో వేరే అభ్యర్థిని పెడుతున్నట్లు సీఎం జగన్ ఆర్కేకు చెప్పారని పేర్కొన్నారు. ఆవేశంతో కాక ఆలోచించి ఆర్కే తిరిగి వైసీపీలోకి వచ్చారని వెల్లడించారు.
జగన్ తో పనిచేసిన ఎవరైనా సీటు ఇచ్చిన ఇవ్వకపోయినా.. ఆయనతో కలిసి నడవడానికి ఇష్టపడతారన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ప్రజలకు మంచి చేయవచ్చు.. తీసేసిన ఎమ్మెల్యేలందరికీ సముచిత స్థానం ఇస్తానని జగన్ చెప్పారని వివరించారు. పదవులకు ఆశపడే కొందరు బయటికి వెళ్తున్నారని నాని అన్నారు.
