Kinjarapu Atchannaidu : ఓటమి భయంతోనే దస్తగిరి కుటుంబంపై దాడి
వివేకా హత్య కేసులో అప్రూవర్ షేక్ దస్తగిరి తండ్రి షేక్ హజీవలిపై వైసీపీ రౌడీల దాడి దుర్మార్గమని టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

Kinjarapu Atchannaidu Sensational Comments on CM jagan
వివేకా హత్య కేసులో అప్రూవర్ షేక్ దస్తగిరి తండ్రి షేక్ హజీవలిపై వైసీపీ రౌడీల దాడి దుర్మార్గమని టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఒకవైపు చెల్లెల్లు, మరోవైపు వివేకా హత్యలో నిందితుడు దస్తగిరి వాస్తవాలు బహిర్గతం చేస్తారనే భయంతో జగన్ రెడ్డి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని అన్నారు. పులివెందులలో జగన్ రెడ్డి అరాచకాలకు, అకృత్యాలకు కాలం చెల్లిందన్నారు. వైఎస్ ఫ్యామిలీ నాలుగైదు దశాబ్దాలుగా పులివెందులను శాసించారని.. ఇప్పుడు వివేకా హత్య కేసులో జగన్ రెడ్డి ముసుగు తొలగిపోవడంతో పులివెందుల ప్రజలే తిరుగుబాటుకు సిద్ధమయ్యారని.. ఆ ఫ్రస్టేషన్లో దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు.
కేసులు, దాడులు, దౌర్జన్యాలతో భయపెట్టి కాలం నెట్టుకు రావాలని చూస్తున్నారని అన్నారు. వివేకా హత్యకు గొడ్డలి అందించిన చేయి ఎవరిదో దస్తగిరి రెండు రోజుల క్రితం బయటపెట్టారని.. జగన్ రెడ్డీ ఇలాంటి హత్యా రాజకీయాలకు, దాడులు, దౌర్జన్యాలకు కాలం చెల్లిందన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఇంకా నీ నియంతృత్వ పోకడలు, ఫ్యాక్షన్ వ్యవహారం చెల్లదన్నారు. దస్తగిరి తండ్రిపై దాడి చేయడంతోనే పులివెందులలో జగన్ రెడ్డి ఓటమి ఖరారైపోయిందన్నారు. తక్షణమే దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దస్తగిరి కుటుంబానికి కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని కోరారు.
