Kesineni Nani : సీఎం జగన్ను కలిసిన కేశినేని నాని
ఇటీవల టీడీపీకి(TDP) రాజీనామా చేసిన కేశినేని నాని(Keshineni Nani), ఆయన కుమార్తె శ్వేత(Swetha) ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకున్నారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్, అయోధ్య రామిరెడ్డి తదితరులతో కేశినేని సీఎంను కలిశారు.

Keshineni Nani

చంద్రబాబు(Chandrababu) తిరువూరు 'రా కదలి రా' సభ నేపథ్యంలో కేశినేని సోదరుల మధ్య వివాదం రేగింది. ఇరు వర్గాలు కొట్లాటకు దిగడంతో హై టెన్షన్ వాతావరణం కనిపించింది. ఈ గొడవ జరిగిన ఒకటి రెండు రోజుల్లోనే కేశినేని నాని తన ఎంపీ(MP) పదవికి టీడీపీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఆయన కుమార్తె కేశినేని శ్వేత కూడా కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు.