తెలుగుదేశంపార్టీ(TDP) కోసం తాను ఎంతో కష్టపడ్డానని, పార్టీ కోసం తన సొంత వ్యాపారాలను పక్కన పెట్టానని ఎంపీ కేశినేని నాని అన్నారు. వ్యాపారాల కంటే పార్టీయే ముఖ్యమని భావించానని, పార్టీ కోసం ఆస్తులు అమ్ముకున్నానని చెప్పారు.

తెలుగుదేశంపార్టీ(TDP) కోసం తాను ఎంతో కష్టపడ్డానని, పార్టీ కోసం తన సొంత వ్యాపారాలను పక్కన పెట్టానని ఎంపీ కేశినేని నాని అన్నారు. వ్యాపారాల కంటే పార్టీయే ముఖ్యమని భావించానని, పార్టీ కోసం ఆస్తులు అమ్ముకున్నానని చెప్పారు. చంద్రబాబు(Chandrababu) పాదయాత్ర, స్థానిక సంస్థల ఎన్నికలను తన భుజంపై మోశానని, పార్టీ కోసం, ప్రజల కోసం నిజాయితీగా కష్టపడ్డానని కేశినేని నాని(Kesineni Nani) అన్నారు. చంద్రబాబు అంతటి మోసగాడు మరొకడు ఉండడని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో(CM Jagan) భేటి తర్వాత కేశినేని నాని మీడియాతో(Media) ముచ్చటించారు.

టీడీపీ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడితో ప్రెస్‌మీట్‌ పెట్టించి తనను తిట్టించారని కేశినేని నాని ఆవేదన వ్యక్తం చేశారు. తనను చెప్పుతీసుకొని కొడతానని ఓ క్యారెక్టర్‌లెస్‌ వ్యక్తి తిట్టినా పార్టీ స్పందిచలేదని వాపోయారు. తనను గొట్టంగాడు అన్న భరించానని అన్నారు. విజయవాడ మేయర్‌గా అభ్యర్థిగా శ్వేతను చంద్రబాబాబే నిర్ణయించారని, ఆయన మూడు రోజులు అడిగితేనే శ్వేత ముందుకొచ్చిందని నాని అన్నారు. తర్వాతే ప్రెస్‌మీట్‌ పెట్టించి తనను బాబు తిట్టించారని గుర్తు చేశారు.'టీడీపీ కోసం సమయం, డబ్బు వృథా చేసుకోవద్దని చాలామందే చెప్పారు. చాలా మంది చెప్పినా కూడా నేను టీడీపీలోనే కొనసాగాను. నేను అమ్ముకున్న ఆస్తుల విలువ 2 వేల కోట్ల రూపాయలు. నా కుటుంబంలో చిచ్చు పెట్టారు. నా కుటుంబ సభ్యులతో కొట్టించాలని లోకేష్‌ ఎందుకు చూశాడు. చంద్రబాబు మోసగాడు అని ప్రపంచానికి తెలుసు. మరీ ఇంత పచ్చిమోసగాడు, దగా చేస్తాడని తెలీదు. ఎంపీగా సీఎం కార్యక్రమాలకు నేను అటెండ్‌ కావాలి అది ప్రోటోకాల్‌. నా విషయంలో టీడీపీ ప్రొటోకాల్‌ మరిచిపోయింది. సీఎం కార్యక్రమాలకు చంద్రబాబు నన్ను హాజరు కానివ్వలేదు' అని కేశినేని నాని వివరించారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు పనికిరాడని చెప్పారు.

Updated On 10 Jan 2024 7:06 AM GMT
Ehatv

Ehatv

Next Story