ఆంధ్రప్రదేశ్‌లో ఉర్సా క్లస్టర్స్ అనే యూఎస్ ఆధారిత డేటా సెంటర్ కంపెనీకి ప్రభుత్వం భూమి కేటాయించడంతో ఈ వివాదం చెలరేగింది.

ఆంధ్రప్రదేశ్‌(AP)లో ఉర్సా క్లస్టర్స్ అనే యూఎస్ ఆధారిత డేటా సెంటర్ కంపెనీకి ప్రభుత్వం భూమి కేటాయించడంతో ఈ వివాదం చెలరేగింది.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ విశాఖపట్నం(Vizag)లోని ఐటీ పార్క్‌లో ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 3.5 ఎకరాల భూమిని కేటాయించినట్లు కేటాయించారు. కొందరైతే ఈ కేటాయింపు 60 ఎకరాల వరకు ఉండవచ్చని, దీని విలువ సుమారు రూ.3000 కోట్లు అని ఆరోపిస్తున్నారు. ఉర్సా క్లస్టర్స్ 2024లో స్థాపించబడిన కొత్త కంపెనీ అని, దీనికి స్పష్టమైన వ్యాపార నేపథ్యం లేదని విమర్శకులు చెప్తున్నారు. ఈ కంపెనీ తెలంగాణ (Telangana)ప్రభుత్వంతో జనవరి 2025లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో రూ.5000 కోట్ల పెట్టుబడి కోసం ఒప్పందం కుదుర్చుకుంది, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో భూమి కేటాయింపు జరిగింది. కంపెనీ చిరునామాలో ఒక కుటుంబం నివసిస్తోందని, ఫోన్ నంబర్ కూడా సరిగా లేదని ఆరోపణలు ఉన్నాయి.

సీపీఐఎం(CPI(M)) రాష్ట్ర కమిటీ సభ్యుడు వి. శ్రీనివాస రావు (v. Srinivasarao)ఈ భూమి కేటాయింపుపై పారదర్శకత లేదని, ఉర్సా కంపెనీకి భూమిని ఉచితంగా ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ, లీజ్ ఒప్పందాలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేటాయింపును రద్దు చేయాలన్నారు. ఉర్సా కంపెనీకి విలువైన భూమిని చౌకగా ఇవ్వడం సరికాదని వాదిస్తున్నారు.ఉర్సా కంపెనీకి భూమి కేటాయింపుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఇప్పటివరకు అధికారిక స్పష్టత లేదు. సీపీఐ(ఎం) ప్రభుత్వం ఈ విషయంపై బహిరంగంగా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది. తెలంగాణలో కూడా ఉర్సా క్లస్టర్స్‌తో ఒప్పందం కుదిరింది, దీనిపై బీఆర్‌ఎస్ నాయకుడు మన్నె కృషాంక్ ఆరోపించారు.

ప్రభుత్వ భూమిని పెట్టుబడుల పేరుతో దోచుకునేందుకు కేశినేని చిన్ని(Kesineni Chinni) ప్రయత్నం చేశారంటూ ‘ఉర్సా’ వెనుక డీల్‌ను మాజీ ఎంపీ కేశినేని నాని (Kesineni Nani)ఆరోపించారు. టీడీపీ(TDP) ఎంపీ కేశినేని బినామీదే "ఉర్సా" అంటూ ట్వీట్‌ చేశారు. కేశినేని చిన్ని, ఉర్సా అబ్బూరి సతీష్‌(abburi Satish)లు భాగస్వాములు. 21 సెంచరీ ఇన్వెస్టమెంట్ ప్రాపర్టీస్ పేరుతో గతంలో కోట్లు వసూళ్లు పాల్పడ్డారు. కేశినేని చిన్ని, ఉర్సా అబ్బూరి సతీష్‌, కోట్లు వసూళ్లు చేసి జనాన్ని మోసం చేశారు’’ అంటూ కేశినేని నాని ఎక్స్‌ వేదికగా రాసుకొచ్చారు. "ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్" (Urusa Clusters)అనే కంపెనీకి విశాఖలో 60 ఎకరాల కేటాయింపు వెనుక విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని దురుద్దేశం ఉన్నట్టు పేర్కొన్న నాని.. 5,728 కోట్ల డేటా సెంటర్ ప్రాజెక్ట్ పేరుతో ఐటీ పార్క్‌లో 3.5 ఎకరాలు, కాపులుప్పడలో 56.36 ఎకరాలు.. మొత్తం 60 ఎకరాల భూమిని ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఇవ్వబోతున్నట్టు వార్తలు వచ్చాయని.. ఈ కేటాయింపు వెనుక విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ తమ బినామీ పేరుతో ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు’’ అని నాని ఆరోపించారు.

ehatv

ehatv

Next Story