Kesineni Chinni : కృష్ణాజిల్లాలో టీడీపీని ఖాళీ చేయడం కేశినేని నాని వల్ల కాదు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు విజయవాడలో ఘనంగా జరిగాయి. నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా టీడీపీ నేత కేశినేని చిన్ని కేక్ కట్ చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు

Kesineni Chinni Comments on Kesineni Nani
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) జన్మదిన వేడుకలు(Birthday Celebrations) విజయవాడ(Vijayawada)లో ఘనంగా జరిగాయి. నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా టీడీపీ నేత కేశినేని చిన్ని(Kesineni Chinni) కేక్ కట్ చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎంపీ కేశినేని నాని(Kesineni Nani)పై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎంపీ కేశినేని నాని దేవినేని అవినాష్(Devineni Avinash)కు ముఖ్య అనుచరుడుగా మారాడని అన్నారు. దేవినేని అవినాష్ ఎటు తిరిగితే ఆయన వెనుక నాని అటు తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు.
కేశినేని నాని వైసీపీ(YCP)లోకి వెళ్లాక ముగ్గురు నలుగురు కూడా నాని వెంట లేరని అన్నారు. కేశినేని నానికి విజయవాడ ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని.. ఉమ్మడి కృష్ణాజిల్లా(Krishna District)లో టీడీపీని ఖాళీ చేయడం కేశినేని నాని వల్ల కాదన్నారు. కేశినేని నాని బూతులు మాట్లాడుతూ కొడాలి నాని(Kodali Nani)లా తయారయ్యారని వ్యాఖ్యానించారు. మేము గేట్లు తెలిస్తే వరదల రావడానికి వైసీపీ నేతలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. దుష్ట పరిపాలన అంతమందించడమే చంద్రబాబు(Chandrababu) లక్ష్యమని పేర్కొన్నారు.
