KCR On YSR: స్వర్గీయ రాజశేఖర్ రెడ్డిని తలుచుకున్న కేసీఆర్
తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్వర్గీయ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మీద కోపంతో తమ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ, ఫీజు రియింబర్స్‌మెంట్ ఆపలేదు కదా.. అని అన్నారు. ఆ రెండు పథకాలకు అదనంగా నిధులు కేటాయించి ముందుకు తీసుకెళ్లామని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్‌ను కాంక్షించే ఏ ప్రభుత్వం కూడా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించదని.. రాష్ట్రం దివాళా తీసిందని ఏ పిచ్చి ముఖ్యమంత్రి కూడా చెప్పారన్నారు కేసీఆర్. అలా చెబితే స్టేట్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని అన్నారు. రాక్షస ఆనందరం కోసం, సంతోషం కోసం తాత్కాలికంగా ఆ నిమిషం వరకు ఉపయోగపడొచ్చు.. రాష్ట్రానికి పెట్టుబడులు ఆశించే దృష్ట్యా రాష్ట్రం బాగుందని చెప్పాలన్నారు. నేను సీఎం అయ్యాక తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెప్పి నిరూపించాను. ధనిక రాష్ట్రమని చెబుతూ ఆ దిశగా పయనిస్తూ అద్భుత విజయం సాధించానని కేసీఆర్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీ గురించి కూడా క్లారిటీగా చెప్పడం లేదని కేసీఆర్ అన్నారు. రైతు రుణమాఫీకి డిసెంబర్ 9 పోయింది.. ఇప్పుడు ఆగస్టు 15 అని అంటున్నారన్నారు. మరి తెలివిగా ఏ ఆగస్టు 15 చెప్పడం లేదని.. వచ్చే ఏడాది ఆగస్టు అంటే అప్పుడు ఏం చేయాలని కేసీఆర్ ప్రశ్నించారు.