Karanam Balaram: నన్ను గెలిపించి ఉంటే.. మంగళగిరిలో నీ కొడుకును ఎందుకు గెలిపించలేకపోయావ్
చంద్రబాబు కంటే దుర్మార్గుడిని ఈ లోకంలోనే చూడలేదని కరణం బలరాం అన్నారు. నిజంగానే నువ్వు నన్ను గెలిపించి
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంపై బాపట్ల జిల్లా ఇంకొల్లులో జరిగిన రా.. కదిలిరా.. బహిరంగ సభలో తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా సమాధానం ఇచ్చారు కరణం బలరాం.
చంద్రబాబు కంటే దుర్మార్గుడిని ఈ లోకంలోనే చూడలేదని కరణం బలరాం అన్నారు. నిజంగానే నువ్వు నన్ను గెలిపించి ఉంటే.. మంగళగిరిలో నీ కొడుకును ఎందుకు గెలిపించలేకపోయావని ప్రశ్నించారు. చంద్రబాబు తనపై అవాకులు, చవాకులు పేలడం వల్లే తాను మాట్లాడాల్సి వస్తుందని కరణం బలరాం అన్నారు. చంద్రబాబు కంటే దుర్మార్గుడిని ఇంవరకు చూడలేదని అన్నారు. నీ చరిత్ర ఏంటో.. నా చరిత్ర ఏందో తేల్చుకుందాం రా అంటూ సవాలు విసిరారు. చంద్రబాబు గురించి మరింత లోతుగా పోదలుచుకోలేదని.. పోతే చాలా ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు. 2019లో చీరాలకు వెళ్తానని తాను అడగలేదని కరణం బలరాం స్పష్టం చేశారు. నారా లోకేశ్‌ను కొంతమంది చీరాలలో తిడితే.. తనను చీరాలకు పంపించారని అన్నారు. చీరాలలో తనను గెలిపించానని చంద్రబాబు చెబుతున్నాడని.. అంత సత్తా ఉంటే మంగళగిరిలో లోకేశ్‌ను ఎందుకు గెలిపించలేకపోయావని ప్రశ్నించారు. చంద్రబాబు హద్దులో ఉండి మాట్లాడితే బాగుంటుందని, ఇంకోసారి తన గురించి మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తాను, చంద్రబాబు 1978లో ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చామన్నారు. తాను యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చంద్రబాబు ఓ బ్లాక్ కి అధ్యక్షుడిగా మాత్రమే ఉన్నారని గుర్తు చేశారు. ఏదో కాలం కలిసొచ్చి కిందా మీదా పడి స్థాయి పెరిగినంత మాత్రాన తనపై చౌకబారు విమర్శలు చేయటం సరికాదన్నారు