Mudragada Padmanabham కాపు జాతిని అవమానించినప్పుడు పవన్ ఎందుకు స్పందించలేదు: ముద్రగడ
వైఎస్సార్‌సీపీ వ్యవస్థాపకుల్లో నేను ఒకడిని.. కానీ, కొన్ని శక్తులు నన్ను సీఎం
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరారు. తాజాగా ఆయన పవన్ కళ్యాణ్ పై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. రాజకీయాల్లో మొలతాడు లేనివాడు ఇప్పుడు నాకు పాఠాలు చెబుతున్నాడని అన్నారు ముద్రగడ. అసలు మీరు చెప్పినట్లు నేను ఎందుకు రాజకీయం చేయాలి. నాకు చెప్పడానికి ఆయన ఎవరని ముద్రగడ ప్రశ్నించారు. అసలు చంద్రబాబు ఐదేళ్ల పాలనలో అసలు పవన్ ఎక్కడ ఉన్నాడు.. కాపు జాతిని అవమానించినప్పుడు పవన్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నలు వేశారు. మీరు సినిమాల్లో హీరో కావొచ్చు.. రాజకీయాల్లో మాత్రం నేనే హీరోనని ముద్రగడ అన్నారు.
వైఎస్సార్‌సీపీ వ్యవస్థాపకుల్లో నేను ఒకడిని.. కానీ, కొన్ని శక్తులు నన్ను సీఎం జగన్‌కు దూరం చేశాయన్నారు. మళ్ళీ ఇన్నాళ్లకు వైఎస్సార్‌సీపీలో చేరడం ఆనందంగా ఉందని తెలిపారు. సీఎం జగన్ కుటుంబానికి ఓ చరిత్ర ఉంది. జగన్ దగ్గరకు ఎందుకు వెళ్ళావు?.. మా నాయకుడు దగ్గరకు ఎందుకు వెళ్ళ లేదు? అని కొందరు పోస్టింగ్ లు పెడుతున్నారు. రాజకీయాల్లో గొప్ప నేనే.. ఆ మాటకొస్తే రాజకీయాల్లోను, సినిమా ఫీల్డ్ లో నేనే ముందున్నానన్నారు ముద్రగడ. నాపై సోషల్ మీడియాలో తప్పుడు రాతలు రాస్తున్నారు.. రాజకీయాల్లోకి రావడానికి కాపులు కారణం కాదన్నారు. బేషరతుగానే వైఎస్సార్‌సీపీలో చేరానని వివరించారు. ప్రజలకు సేవ చేయడానికే ఈ పార్టీని ఎంచుకున్నానని ముద్రగడ ప్రెస్ మీట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు.