చూస్తే అవి పూత రేకుల పార్సిళ్లలాగే కనిపిస్తాయి.

చూస్తే అవి పూత రేకుల పార్సిళ్లలాగే కనిపిస్తాయి. తెరచి చూస్తే మాత్రం కళ్లు బైర్లు కమ్ముతాయి. నోట మాట రాకుండా పోతుంది. ఎందుకంటే అందులో ఉన్నది గంజాయి(weed) కాబట్టి. కడప జిల్లా(Kadapa) ప్రొద్దుటూరులో ఇలా గంజాయిని తరలిస్తుంటే పోలీసలు పక్కా ఆధారాలతో పట్టుకున్నారు. వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు పూత రేకుల పార్సిళ్లలో అక్రమంగా తరలిస్తున్న గంజాయి కంటపడింది. కొవ్వూరు(Kovvuru) గ్యారేజ్‌లోని ఖాళీ స్థనంలో కొందరు వ్యక్తులు కొన్ని రోజులుగా గంజాయిని అమ్ముతున్నట్టు తెలుసుకున్నారు. ఇందులో వైజాగ్‌కు చెందిన కిరణ్‌కుమార్‌ కీలక సూత్రధారి.. ఆయనను పోలీసులు అరెస్ట్‌ చేసి విచారణ జరుపుతున్నారు. వీరు విశాఖ నుంచి పూతరేకుల కొరియర్‌ ద్వారా గంజాయిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని, స్థానికంగా ఎర్రగుంట్లకు చెందిన వ్యక్తులతో విక్రయిస్తున్నారని డీఎస్పీ భక్తవత్సలం చెప్పారు.

Eha Tv

Eha Tv

Next Story