Raja Reddy Death : రాజా రెడ్డిది హత్యే.. సంచలన విషయాలు వెల్లడించిన పోలీసులు
కడప(Kadapa) జిల్లా ప్రొద్దుటూరులో సంచలనం కలిగించిన పూజా స్కూల్ ఛైర్మెన్ రాజా రెడ్డి(Raja Reddy) అనుమానస్పద మృతి కేసును హత్య గా(Murder) తేల్చారు పోలీసులు. ఆస్తుల తగాదాల విషయంలో సొంత తమ్ముడు శ్రీధర్ రెడ్డి(Shreedhar Reddy), తమ్ముడు భార్య ప్రసన్నలు(Prasanna) కలిసి హత్య చేసినట్లు వెల్లడించారు.

Ram Reddy Death
కడప(Kadapa) జిల్లా ప్రొద్దుటూరులో సంచలనం కలిగించిన పూజా స్కూల్ ఛైర్మెన్ రాజా రెడ్డి(Raja Reddy) అనుమానస్పద మృతి కేసును హత్య గా(Murder) తేల్చారు పోలీసులు. ఆస్తుల తగాదాల విషయంలో సొంత తమ్ముడు శ్రీధర్ రెడ్డి(Shreedhar Reddy), తమ్ముడు భార్య ప్రసన్నలు(Prasanna) కలిసి హత్య చేసినట్లు వెల్లడించారు. 11వ తేదీ రాత్రి 10 గంటలకు పూజా స్కూల్ ఆవరణలో ఉన్న రాజా రెడ్డిపై దాడి చేసి హత్య చేసినట్లు పేర్కొన్నారు. గొంతు నులిమి, ఊపిరి ఆడకుండా చంపారని వివరించారు.
రాజారెడ్డిని చంపాక శ్రీధర్ రెడ్డి, ప్రసన్న ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని తెలిపారు. రాజారెడ్డి గుండెపోటుతో మరణించాడని నిందితులు, ఉపాధ్యాయులు చిత్రీకరించారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ వీరనాథ్ రెడ్డినిందితులకు సహకరించినట్లు వెల్లడించారు.
జిల్లా ఎస్పీ, కలెక్టర్ ఆదేశాలతో రీపోస్ట్ మార్టం చేయడంతో హత్య విషయం బయటపడ్డట్లు తెలిపారు. మృతుడు రాజా రెడ్డి తమ్ముడు శ్రీదర్ రెడ్డి, తమ్ముడు బార్య ప్రసన్న,ఇద్దరు కిరాయి వ్యక్తులు, ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ వీరనాథ రెడ్డిపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.
