Avinash Reddy : అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్న వైఎస్ అవినాష్ రెడ్డి
కడప(Kadapa) నగరంలోని ప్రాచీనమైన అమీన్ పీర్ పెద్దదర్గాను(Amin Peer Pedda dargah) ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి(YS Avinash Reddy) దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆ తర్వాత వైయస్సార్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని ఖాజీపేట మండలంలోని రావులపల్లి, చెమ్ములపల్లి పంచాయతీలలో నూతనంగా నిర్మించిన ఆర్బీకే, వైయస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ లను ప్రారంభించారు.

Avinash Reddy
కడప(Kadapa) నగరంలోని ప్రాచీనమైన అమీన్ పీర్ పెద్దదర్గాను(Ameen Peer Pedda dargah) ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి(YS Avinash Reddy) దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆ తర్వాత వైయస్సార్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని ఖాజీపేట మండలంలోని రావులపల్లి, చెమ్ములపల్లి పంచాయతీలలో నూతనంగా నిర్మించిన ఆర్బీకే, వైయస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ లను ప్రారంభించారు.
ఇదిలావుంటే.. వైఎస్ వివేకానందరెడ్డి(YS vivekanandha Reddy) హత్య కేసులో ఇటీవల ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. వివేకా హత్య కేసులో కోర్టుకు రావాల్సిందిగా గత నెల 14వ తేదీన వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ కోర్టు(CBI Court) సమన్లు జారీ చేసింది. దీంతో ఆయన కోర్టు ముందు హాజరయ్యారు. అవినాష్‌తో పాటు వైఎస్ భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ హాజరయ్యారు. విచారణ అనంతరం కోర్టు తదుపరి విచారణను వచ్చే నెల 1వ తేదీకి వాయిదా వేసింది.
