వివేకా హత్యకేసు(YS Viveka Murder Case)లో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి(Kadapa MP Avinash Reddy) సీబీఐ విచారణ(CBI Enquiry)కు హాజరవుతున్న నేపథ్యంలో సీఎం జగన్‌(CM Jagan) కీలక సమావేశం నిర్వహించారు. డీజీపీ(DGP), ప్రభుత్వ సలహాదారుతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి(DGP Rajendranath Reddy), ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy)తో ఏపీ సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు.

వివేకా హత్యకేసు(YS Viveka Murder Case)లో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి(Kadapa MP Avinash Reddy) సీబీఐ విచారణ(CBI Enquiry)కు హాజరవుతున్న నేపథ్యంలో సీఎం జగన్‌(CM Jagan) కీలక సమావేశం నిర్వహించారు. డీజీపీ(DGP), ప్రభుత్వ సలహాదారుతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి(DGP Rajendranath Reddy), ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy)తో ఏపీ సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం(Tadepalli Camp Office)లో నిర్వహించిన ఈ సమీక్షలో వివేకా హత్య కేసు పరిణామాలపైనా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేస్తే ఎలా ముందుకెళ్లాలనే అంశంపై సమీక్షలో చర్చ జరిగినట్లు సమాచారం. మరోవైపు ఎంపీ అవినాష్‌రెడ్డి మరికాసేపట్లో సీబీఐ ఎదుట విచారణకు హాజరుకానున్నారు. అయితే, అతడిని అరెస్టు చేసే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో సీఎం సమీక్ష నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక వేళ అరెస్టు చేస్తే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పార్టీ పరంగా ఎలాంటి వ్యూహం అమలు చేయాలన్న దానిపై దానిపై సీఎం చర్చించినట్లు సమాచారం.

Updated On 18 April 2023 5:34 AM GMT
Ehatv

Ehatv

Next Story