మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసులో తనపై వస్తున్న ఆరోపణలకు సుదీర్ఘ వివరణ ఇచ్చుకున్నారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అవినాష్‌ రెడ్డి. ఈ కేసులో ఎ-1 నిందితుడు గంగిరెడ్డికి బెయిల్‌ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసిన కాసేపటికే అవినాష్‌రెడ్డి హత్యకు సంబంధించి తన వాదనను వినిపిస్తూ ఓ వీడియో రిలీజ్‌ చేశారు.

ఆయన చెప్పిన విషయాలను ఆయన మాటల్లోనే ...

'వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు ఆయన బావమరిది శివప్రకాశ్‌రెడ్డి నాకు ఉదయం ఆరున్నరకు ఫోన్‌ చేశారు. నేను అప్పటికే జమ్మలమడుగుకు వెళుతున్నాను. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరికల కార్యక్రమానికి అటెండ్‌ అవుతున్నారు. సరిగ్గా పులివెందుల రింగురోడ్డులో ఉన్నప్పుడు నాకు శివప్రకాశ్‌రెడ్డి నుంచి ఫోన్ వచ్చింది. వివేకా బావ ఇంటికి అర్జెంట్‌గా వెళ్లమని చెప్పాడు. నేను ఎందుకని రెట్టిస్తే వివేకా నో మోర్‌ అని చెప్పారు. వెంటనే నేను వివేకా అంకుల్‌ ఇంటికి వెళ్లాను. వివేకా రాసిన ఉత్తరం, ఫోన్‌ గురించి ఆయన పీఏ కృష్ణారెడ్డి, వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డికి చెప్పారు. అయితే ఆ ఉత్తరం, ఫోన్‌ను దాచమని రాజశేఖర్‌రెడ్డి చెప్పారు. అప్పుడే నాకు ఆశ్చర్యం వేసింది. ఉత్తరంలో డ్రైవర్‌ ప్రసాద్‌ను వదిలిపెట్టవద్దని వివేకా రాశారు. ఈ హత్య కేసులో ఆ ఉత్తరమే అత్యంత కీలకం. ప్రసాద్‌ను ఎవరైనా ఏమైనా అంటారేమో అని ఆ లెటర్‌ను దాచమని సునీత చెప్పారు. మీ నాన్నను కాకుండా, డ్రైవర్‌ ప్రసాద్‌ను నమ్ముతారా? లెటర్‌ విషయాన్ని నాకు, పోలీసులకు చెప్పలుదు. ఆ లెటర్‌ విషయంపై సీబీఐ ఎందుకు ఫోకస్‌ చేయడం లేదు. ఎవరిని కాపాడటానికి ఇదంతా చేస్తున్నారు? వివేకాది హత్య అని తెలిసిన తర్వాత కూడా ఉత్తరం ఎందుకు దాచారు? మీ వైపు తప్పు ఉంది కాబట్టే ఆ లెటర్‌ను దాచారు. ఇదే విషయాన్ని నేను సీబీఐకి చెప్పాను' అని వీడియోలో అవినాష్‌ వివరణ ఇచ్చుకున్నారు.

Updated On 27 April 2023 3:33 AM GMT
Ehatv

Ehatv

Next Story