YS Viveka Murder Case : అవినాష్‌రెడ్డికి హైకోర్టులో ఊరట.. 25 వరకు అరెస్ట్ చేయవద్దని ఆదేశం..
మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసు(YS Viveka Murder case)లో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. అవినాష్‌రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ నెల 25 వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ రోజు వరకు అవినాష్‌రెడ్డి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. సీబీఐ విచారణ మొతత్ం ఆడియో, వీడియో రికార్డు చేయాలని సూచించింది.
మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసు(YS Viveka Murder case)లో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. అవినాష్‌రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ నెల 25 వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ రోజు వరకు అవినాష్‌రెడ్డి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. సీబీఐ విచారణ మొతత్ం ఆడియో, వీడియో రికార్డు చేయాలని సూచించింది. ఈ నెల 25న ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తుది తీర్పు ఇస్తామని తెలిపింది.
అంతకు ముందు అవినాష్ తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. దస్తగిరి వాంగ్మూలం మినహా అవినాష్‌పై ఎలాంటి ఆధారాలు లేవన్నారు. దర్యాప్తులో గూగుల్ టేకవుట్ డేటాపై అధారపడటం మంచిదికాదని తెలిపారు. సునీల్ యాదవ్ కదలికలపై దస్తగిరి వాంగ్మూలం, గూగుల్ డేటా విరుద్ధంగా ఉన్నాయని, దస్తగిరి చెప్పింది తప్పా? గూగుల్ డేటా తప్పా? అన్నది తెలియడం లేదని నిరంజన్‌రెడ్డి కోర్టుకు తెలిపారు. కుటుంబ, ఆర్థిక వివాదాలు, వివాహేతర సంబంధాలు హత్యకు కారణం కావచ్చు అని అన్నారు. బంధువు కాబట్టి హత్యాస్థలికి వెంటనే వెళ్లామని, గదిని శుభ్రం చేయడం వెనుక ఎలాంటి కుట్ర లేదని కోర్టుకు వివరించారు.
ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంది. వివేకానందరెడ్డికి గుండెపోటు అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందని ప్రశ్నించింది. అక్కడున్నవారు గుండెపోటు అని చెబితే అదే విషయం చెప్పారని నిరంజన్‌రెడ్డి కోర్టుకు తెలిపారు. సీబీఐ విచారణకు వెళ్లేందుకు అవినాష్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. హైకోర్టులో విచారణ కొనసాగుతున్నందున రేపు ఉదయం విచారిస్తామని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అవినాష్‌రెడ్డి నుంచి మరింత సమాచారం సేకరించాల్సి ఉందని, ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని కోర్టుకు తెలిపారు. ఇంతకు ముందు నాలుగుసార్లు ప్రశ్నించినప్పుడు అవినాష్ సహకరించలేదని, వివేకా హత్య కుట్ర అవినాష్‌రెడ్డికి తెలుసని అన్నారు. దర్యాప్తులో శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలు సేకరించామని తెలిపారు. ఆర్థిక, వివాహేతర సంబంధాలపై ఆధారాలులేవన్నారు. హత్యలో ఉపయోగించిన ఆయుధం రికవరీ కాలేదని, హత్య తర్వాత నిందితుడు ఆయుధంతో అవినాష్ ఇంటికి వెళ్లాడని సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.