పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్‌, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి(B.Tech Ravi) జ్యుడీషియల్ రిమాండ్(Judicial Remard) ను కడప మేజిస్ట్రేట్ కోర్టు(Kadapa Court) మరో 14 రోజులు పొడిగించింది. దీంతో ఆయ‌న‌ డిసెంబర్ 11 వరకు పోలీసుల క‌స్ట‌డీలో ఉండ‌నున్నారు. కోర్టు తీర్పుతో పోలీసులు బీటెక్ రవిని జైలుకు తరలించారు. జనవరి 25న కడప విమానాశ్రయం(airport) దగ్గర పోలీసులలో జరిగిన వాగ్వాదం నేపథ్యంలో రవిపై కేసు నమోదయింది.

పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్‌, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి(B.Tech Ravi) జ్యుడీషియల్ రిమాండ్(Judicial Remard) ను కడప మేజిస్ట్రేట్ కోర్టు(Kadapa Court) మరో 14 రోజులు పొడిగించింది. దీంతో ఆయ‌న‌ డిసెంబర్ 11 వరకు పోలీసుల క‌స్ట‌డీలో ఉండ‌నున్నారు. కోర్టు తీర్పుతో పోలీసులు బీటెక్ రవిని జైలుకు తరలించారు. జనవరి 25న కడప విమానాశ్రయం(airport) దగ్గర పోలీసులలో జరిగిన వాగ్వాదం నేపథ్యంలో రవిపై కేసు నమోదయింది. ఈ నెల 14న వల్లూరు పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.

కడప జిల్లాలో యువగళం పాదయాత్రలో(Yuvagalam Padayatra) భాగంగా లోకేశ్‌కు(Lokesh) స్వాగతం పలికేందుకు బీటెక్ రవి.. పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి విమానాశ్రయంకు వెళ్లారు. అయితే విమానాశ్రయం లోపలికి వెళ్లేందుకు బీటెక్ రవి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీటెక్ రవి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా పది నెలల అనంతరం బీటెక్ రవిని పోలీసులు అరెస్ట్ చేశారు.

అయితే టీడీపీ మాత్రం పులివెందులలో బీటెక్ రవి రోజు రోజుకు బలపడుతుండటాన్ని తట్టుకోలేకనే.. వైసీపీ కావాలని అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపింద‌ని ఆరోపణలు చేస్తుంది.

Updated On 27 Nov 2023 4:21 AM GMT
Ehatv

Ehatv

Next Story